మార్కెట్ లోకి వచ్చేసిన వోబుల్ వన్..50MP ట్రిపుల్ కెమెరా, ధర ఎంతంటే?

భారత మార్కెట్ లోకి అనేక రకాల మొబైల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇండ్ కల్ టెక్నాలజీస్ (Indkal Technologies Pvt Ltd) అనే స్వదేశీ సంస్థ నుంచి మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది.


వోబుల్ వన్ ( Wobble One) పేరుతో ఈ కొత్త మొబైల్ తీసుకువచ్చారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ మొబైల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

ఇక ఈ వోబుల్ వన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.67 అంగులాల AMOLED డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ 7400 డైమెన్‌సిటీ ఉన్న ప్రాసెసర్ ఆధారంగా వర్క్‌చేయనుంది. వోబుల్ వన్ ( Wobble One) పేరుతో వచ్చిన ఈ ఫోన్ కు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ రానుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mAh ఉండనుంది. Android 15 ఆధారంగా ఈ ఫోన్ వర్క్ చేయనుంది. ఇక 8GB+128GB వేరియంట్ మొబైల్ ధర రూ.22,000గా ఫిక్స్ చేశారు. 8GB+256GB, 12 GB+256GB వేరియంట్ ఫోన్స్ ధరలు త్వరలోనే ప్రకటించనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.