ఈ మధ్యకాలంలో పెద్ద పట్టణాలతోపాటు చిన్న పట్టణాలకు కూడా సూపర్ మార్కెట్ వ్యవస్థ అనేది విస్తరించింది. ఒకప్పుడు నెలసరుకుల కోసం కిరాణా షాపులకు కానీ హోల్సేల్ మార్కెట్లకు కానీ వెళ్లేవారు.
కానీ ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవస్థలో పూర్తిగా మార్పులు వచ్చిన నేపథ్యంలో డిమార్ట్ లాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సూపర్ మార్కెట్లలో అన్ని వస్తువులు ఒకే దగ్గర లభిస్తుండడం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రిటైల్ మార్కెట్ వ్యవస్థ పెద్ద ఎత్తున విస్తరించిన నేపథ్యంలో సబ్బుబిళ్ళ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ ఒకే దగ్గర లభిస్తున్న నేపథ్యంలో డీమార్ట్, రిలయన్స్ జియోమార్ట్, బిగ్‌బజార్ లాంటి సూపర్ మార్కెట్లకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వివిధ రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉండటంతో పాటు వాటి ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. అలాగే డిస్కౌంట్ ఆఫర్స్ కూడా పెద్ద మొత్తంలో సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి.
ఈ కారణంగానే డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లకు వెళ్లేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ బిల్లు వాచిపోవడం ఖాయం. ఉదాహరణకు మీకు నెలకు సరిపడా సరుకుల ఖర్చు 3 అయినట్లయితే సూపర్ మార్కెట్లలో ఇష్టం వచ్చినట్లు షాపింగ్ చేయడం వల్ల బిల్లు 5000 రూపాయల నుంచి 8 వేల రూపాయల వరకు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అవసరం ఉందా లేకపోయినా కళ్ళముందు కనిపిస్తున్నటువంటి వస్తువులను చూసి ఆకర్షితులై వరుసగా మీ చేతికి ఇచ్చిన చక్రాల బండిలో సరుకులను నిండా నింపేసుకుని బిల్లు చూడగానే నిరాశతో బిల్లు చెల్లించి బయటకు వస్తుండటం ఈ మధ్యకాలంలో అన్ని సూపర్ మార్కెట్లోనూ కనిపిస్తున్నటువంటి సాధారణ దృశ్యంగా చెప్పవచ్చు. అయితే డి మార్ట్ లాంటి సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సంవత్సరానికి పెద్ద మొత్తంలో డబ్బు మిగిల్చుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
మీకు ఏ వస్తువులు అవసరమో ముందే లిస్టు రాసుకోండి..
సూపర్ మార్కెట్లలో సాధారణంగా ప్రవేశించగానే మీకు ప్రారంభంలో బిస్కెట్లు చాక్లెట్లు బేకరీ వస్తువులు పెద్ద మొత్తంలో కనిపిస్తుంటాయి. వాటి పట్ల ఆకర్షితులు అవ్వకుండా మీకు ఏవైతే వస్తువులు అవసరమో వాటిని ఒక లిస్టు ద్వారా రాసుకొని, ఇంట్లో అవసరం అనుకున్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేసినట్లయితే మీకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. . డిస్కౌంట్ ధరలకు అందిస్తున్నారు కదా అని కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నటువంటి వస్తువులను కొనుగోలు చేసినట్లయితే మీ బిల్లు తడిసి మోపెడు అవుతుంది.
బ్రాండ్స్ చూసి కొనండి
సాధారణంగా సూపర్ మార్కెట్లలో బ్రాండ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో పేరు ఉన్నటువంటి బ్రాండ్ తో పాటు, వాటి పక్కనే సేమ్ ప్రోడక్ట్ మరొక బ్రాండ్ తక్కువ ధరకు లభిస్తుంటాయి. ఉదాహరణకు వాషింగ్ పౌడర్ మార్కెట్లో పేరు ఉన్నటువంటి బ్రాండ్ వంద రూపాయలకు ఒక కేజీ లభిస్తుంటే, అదే స్టోర్ కు సంబంధించినటువంటి స్వంత బ్రాండ్ ఉత్పత్తి అయిన వాషింగ్ పౌడర్ కేవలం కేజీ 50 రూపాయలకే లభిస్తుంది. ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల మీ బిల్లు తగ్గుతుంది. ఉదాహరణకు డిమార్ట్ మార్కెట్ లోని ఇతర బ్రాండ్ వస్తువులతో పాటు తమ సొంత బ్రాండ్ కి చెందినటువంటి డిమార్ట్ ప్రీమియం వస్తువులను కూడా అందుబాటులో ఉంచింది.
లూజు వస్తువులని కొనుగోలు చేయండి..
ప్యాకింగ్ వస్తువుల కన్నా కూడా లూజుగా లభించే కందిపప్పు, మినప్పప్పు, పంచదార, బియ్యం వంటివి డిమార్ట్ వంటి స్టోర్లలో కూడా లభిస్తాయి. వాటి ధర తక్కువగా ఉంటుంది. మీకు ఎన్ని కేజీలు కావాలో ముందుగా నిర్ణయించుకొని ఒక రెండు నెలలకు సరిపడా స్టాక్ ముందుగానే ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసుకుంటే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది.
ఆఫర్లను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూడండి
బై వన్ గెట్ వన్, కాంబో ఆఫర్, ఫెస్టివల్ సేల్ వంటివి చూసి జాగ్రత్తగా షాపింగ్ చేసుకోండి. కొన్నిసార్లు మీకు నిత్యవసరం అయినటువంటి వాషింగ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, టాయిలెట్ డిటర్జెంట్, ఇతర వస్తువులు డిస్కౌంట్ లో లభిస్తాయి వీటిని తీసుకోవడం ద్వారా మీకు బిల్లు ఆదా అవుతుంది.
సూపర్ మార్కెట్లకు పిల్లలను తీసుకెళ్లవద్దు..
ఇక కౌంటర్ వద్ద కనిపించే చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర ఆకర్షణీయమైనటువంటి వస్తువుల పట్ల మీరు దూరంగా ఉంటే మంచిది. . ముఖ్యంగా ఇలాంటి షాపింగ్ సెంటర్లకు సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు పిల్లలను తీసుకొని వెళ్లకపోడమే మంచిది. అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా చాక్లెట్లు బిస్కెట్లు పెద్ద ఎత్తున డిస్ ప్లేలో ఉంచుతారు. వాటిని కొనమని పిల్లలు మారం చేసే అవకాశం ఉంటుంది.
ఒకటికి రెండు సూపర్ మార్కెట్లలో ధరలను బేరీజు వేసుకొని షాపింగ్ ప్లాన్ చేసుకోండి. తద్వారా మీ బిల్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డుల పైన ఆఫర్స్ ఉపయోగించకోవడం వల్ల మీ బిల్లు మరింత తగ్గవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి షాపింగ్ సలహాలు పాటించమని కస్టమర్లకు సూచన ఇవ్వడం లేదు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రమే పేర్కొనడం జరిగింది. ఎలాంటి బ్రాండ్స్ లేదా ఉత్పత్తులను కొనుగోలు చేయమని సలహా ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా పాఠకులకు అవగాహన కోసం మాత్రమే సూచనగా పరిగణించరాదు.
































