ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్

యూరప్ లో అందమైన పర్వతాలు, సరస్సులతో కూడిన చిన్న దేశం స్విట్జర్లాండ్. ఆ దేశంలో సుమారు 9 మిలియన్ల జనాభా ఉంది. స్విట్జర్లాండ్ చాక్లెట్లు, గడియారాలు, బ్యాంకులకు ప్రసిద్ధి చెందింది.


అందరికీ తెలియని మరో విషయం ఏంటంటే.. భూగర్భంలో లక్షల కొద్ది బంకర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఏకంగా 370,000 కంటే ఎక్కువ బంకర్లను నిర్మించింది. ఇవి ప్రజలు సేఫ్ గా ఉండేందుకు అత్యతం సురక్షితంగా నిర్మిస్తున్నారు. బాంబులు, అణు దాడులు, పెద్ద విపత్తుల నుంచి ప్రజలను రక్షిస్తాయి. దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి తగినంత బంకర్ స్థలం ఉన్న.. ప్రపంచంలోని ఏకైక దేశం స్విట్జర్లాండ్. కొంత అదనపు స్థలం కూడా ఉండటం విశేషం.

స్విట్జర్లాండ్‌ లో ఎందుకు ఇన్ని బంకర్లు?

చాలా కాలం క్రితం, కోల్డ్ వార్ సమయంలో (1950-1980), చాలా దేశాలు అణు యుద్ధానికి భయపడేవి. 1963లో, స్విట్జర్లాండ్ ఓ కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి కొత్త ఇల్లు, అపార్ట్‌ మెంట్ భవనంలో బంకర్ ఉండాలి. భవనం చాలా చిన్నగా ఉంటే, యజమాని పెద్ద పబ్లిక్ బంకర్లను నిర్మించడానికి సహాయం చేయడానికి డబ్బు చెల్లించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ దేశ ప్రజలు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.

బంకర్లు ఎలా నిర్మిస్తారంటే?

ఈ దేశంలో నిర్మించిన సుమారు 360,000 బంకర్లు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి. ఇవి ఇళ్ళు, అపార్ట్‌ మెంట్ భవనాల అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. సాధారణ సమయాల్లో, ప్రజలు వాటిని స్టోర్ గదులుగా, వైన్ సెల్లార్లుగా, జిమ్‌ లుగా, ఆట గదులుగా ఉపయోగిస్తారు. వీటిని బాంబులు, రేడియేషన్‌ ను ఆపడానికి చాలా మందపాటి గోడలు, బలమైన తలుపులు ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన వాయువులను అంటే రసాయనాలు, అణు ధూళి లోపలికి రాకుండా ప్రత్యేకమైన ఎయిర్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పడకలు, నీరు, ఆహారం కోసం ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. అత్యవసర విద్యుత్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 9,000 పెద్ద పబ్లిక్ బంకర్లు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితులలో యజమానులు బంకర్‌ను శుభ్రం చేసి ప్రజలు అందులో ఉండేందుకు రెడీ చేయాల్సి ఉంటుంది.

బంకర్లు ఎందుకు ముఖ్యం అంటే?

2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు, చాలా మంది స్విస్ ప్రజలు మళ్ళీ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ఏ సమయం ఎలా ఉంటుందోననే ఆలోచనతో పాత బంకర్లను స్విస్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాటిని మరమ్మతు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తోంది. ఈ బంకర్ల తలుపులు, ఎయిర్ సిస్టమ్స్ ను అప్ డేట్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ ప్రజలు ఎలాంటి విపత్తును అయినా తట్టుకునేలా వీటిని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అందుకే, స్విస్ ప్రజలను సేఫ్ గా ఉంచేందుకు అక్కడి ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.