భూమ్మీద కోల్డెస్ట్ రైలు ప్రయాణాలు, విండో ఓపెన్ చేస్తే గడ్డకట్టుకుపోతారండోయ్

ట్టమైన అడవుల నడుమ, ఎడారుల మధ్యలో నుంచి, సముద్రాల మీదుగా వెళ్లే రైలు ప్రయాణాల గురించి తెలుసు. మంచు కొండల నడుమ వెళ్లే రైలు ప్రయాణాలను కూడా చూశాం.


జమ్మూకాశ్మర్ లో ప్రతి శీతాకాలం ప్రయాణీకులు ఈ అనుభూతిని పొందుతూనే ఉంటారు. అయితే, ట్రాన్స్ సైబీరియన్, ఆర్కిటిక్ సైబీరియాలోని రైళ్లు ప్రపంచంలోనే అత్యంత కొల్డెస్ట్ రైలు ప్రయాణాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రైళ్లు ఏకంగా -50°C నుంచి -62°C చల్లదనంలో ప్రయాణిస్తాయి. ప్రత్యేక హీటర్ల సాయంతో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేస్తారు. ఈ చల్లని ప్రయాణాలు ఒక ప్రత్యేకమైన ప్రయాణ సాహసాన్ని అందిస్తాయి.

⦿ ట్రాన్స్-సైబీరియన్ రైల్వే ప్రయాణం

ట్రాన్స్-సైబీరియన్ రైల్వే ఉష్ణోగ్రతలు -62°C ఉండే ప్రాంతాల గుండా వెళుతుంది. ముఖ్యంగా మొగోచా- స్కోవోరోడినో స్టేషన్ల మధ్య చలి అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇది భూమిపై అత్యంత శీతల రైలు మార్గంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోని అత్యంత శీతల నగరమైన యాకుట్స్క్‌కు వెళ్లే రైలు శీతాకాలంలో -50°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలో నుంచి దూసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేక తాపన విధానం ప్రయాణీకులను వెచ్చగా ఉంచుతుంది. ఇక్కడ రైళ్లు ఘనీభవించిన మంచు ట్రాకుల మీద నడుస్తాయి.

⦿ రష్యా ఆర్కిటిక్ సర్కిల్ రైల్వే

ముర్మాన్స్క్‌ కు ప్రయాణించే రైళ్లు నెలల తరబడి శీతల పరిస్థితులతో ఆర్కిటిక్ సర్కిల్‌ లో ప్రయాణిస్తాయి. ఈ మార్గాలు తరచుగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆపరేషన్స్ ను కాస్త జాగ్రత్తగా కొనసాగిస్తారు.

⦿ తాపన, భద్రతా చర్యలు

ముంచు ప్రయాణాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాక్‌లు, రైళ్లు కీలకమైన ప్రదేశాలలో తాపన వ్యవస్థలతో అమర్చబడి ఉంటాయి. GPS పర్యవేక్షణ, అల్ట్రాసోనిక్ టెస్ట్ గడ్డకట్టే వాతావరణంలో ప్రమాదాలను ముందుగానే గుర్తించడంలో, వాటిని ఎదుర్కొని ముందుకు సాగడంలో సాయపడుతాయి.

⦿ శాశ్వత మంచుతో సవాళ్లు

నిజానికి శాశ్వత మంచు ప్రదేశాల్లో రైల్వేలను నిర్మించడం, మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమైన పని. పట్టాలకు ఉండే తాపన వ్యవస్థ కారణంగా ఇతర సమస్యలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో చల్లని ప్రాంతాలలో ట్రాక్ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఇంజనీర్లు ప్రత్యేక పదార్థాలు, డిజైన్లను ఉపయోగిస్తారు.

⦿ తీవ్రమైన చలిలో ప్రయాణీకుల అనుభవం

ప్రయాణీకులు ఇలాంటి వాతావరణ పరిస్థితులలో వెళ్లే సమయంలో ఇబ్బంది పడతారు. కానీ, రైళ్లలో తాపన వ్యవస్థలు కోచ్ లను వేడిగా ఉంచుతాయి. తీవ్రమైన శీతాకాల వాతావరణంలో కూడా, రైల్వేలు ప్రయాణాలను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి.

⦿ మంచుకొండల్లో రైలు ప్రయాణాల అందం

అత్యంత కష్టమైన శీతల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ చల్లని మార్గాలు మంచుతో నిండి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఎటు చూసినా మంచు అందాలు, మంచులో ఉండే జంతువులు ఆకట్టుకుంటాయి. ఇటువంటి ప్రయాణాలు జీవితంలోమరుపురాని అనభూతులను అందిస్తాయి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.