ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
నోట్: దరఖాస్తుకు పది రోజులే గడువు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 124 మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 124
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
మేనేజ్ మెంట్ ట్రెయినీ : 124 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులతో డిగ్రీ (కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ), పీజీలో పాసై ఉండాలి. ఈఅర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపుఉంటుంది. 2025 డిసెంబర్ 5వ తేదీ నాటికి 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.50,000 నుంచి 1,60,000. సంవత్సరం తరువాత నెలకు రూ.60,000 – రూ.1,80,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన డేట్స్:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 15
దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 5
ఎగ్జామ్ తేది: 2026 జనవరి, ఫిబ్రవరి
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.50,000 నుంచి 1,60,000. సంవత్సరం తరువాత నెలకు రూ.60,000 – రూ.1,80,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 124
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 5



































