తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 12,760 గ్రామాలకు, లక్షా 13 వేల 534 వార్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది.


డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగుతుందని పేర్కొన్నారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.