నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా ఎగురుతున్నది ఇక్కడే

తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి దాదాపు నలభై రెండేళ్లయింది. అయితే ఈ రెండేళ్లలో అస్సలు ఓటమి ఎరుగని నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో రెండే రెండు ఉన్నాయి.


ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ఒకటి కాగా, మరొకటి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం మరొకటి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటమి అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. ఇతర పార్టీలకు ఇక్కడి ప్రజలు గెలుపు అవకాశం ఇవ్వలేదు. అభ్యర్థులు ఎందరిని మార్చినా.. పార్టీలు అనేకం పుట్టుకొచ్చినా ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం పసుపు జెండా నాలుగు దశాబ్దాల నుంచి ఎగురుతూనే ఉంది. ఇక్కడ పోటీ చేసే ప్రత్యర్థులు నామమాత్రమే. అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే వరసగా గెలుపించుకుంటూ ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు పార్టీకి అండగా నిలిచారు. రెండు నియోజకవర్గాలు రాయలసీమలోనే ఉండటం విశేషం.

అధికారంలో లేనప్పుడు.. ఉన్నప్పుడు…అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానప్పుడు కూడా ఇక్కడ టీడీపీ జెండా మాత్రం గెలుస్తూనే ఉంది. దీంతో పాటు ఇచ్ఛాపురం, ఉండి నియోజకవర్గాలకు కూడా అదే ట్రాక్ రికార్డు ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ పది సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకూ 9 సార్లు ఉండి, ఇచ్ఛాపురంలో టీడీపీ అభ్యర్థులను అక్కడి ప్రజలు గెలిపించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 1983, 1985 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్న్.రంగస్వామి నాయుడు గెలిచారు. ఇక 1989లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. 989, 1994, 1999, 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గెలిచారు. మెజారిటీ కూడా పెద్దగా మార్పులేకుండా గెలిచారు. కర్ణాటక, తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గం చంద్రబాబుకు అడ్డాగా మారింది. కర్ణాటక సరిహద్దుల్లో…ఇక ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓడి పోవడం ఖాయంగానే భావించి బరిలోకి దిగాల్సి వస్తుంది. అందులోనూ చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో ఇక కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు, టీడీపీకి కేరాఫ్ గా మారింది. హిందూపురం నియోజకవర్గం కూడా అంతే. ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. టీడీపీ ఏర్పాటయిన పదకొండు ఎన్నికల్లో టీడీపీయే గెలిచింది. 1983లో రంగనాయకులు, 1985, 1994లోనందమూరి తారక రామారావు, 1996లో నందమూరి హరికృష్ణ, 1999లో వెంకటరాముడు, 2004లో పి. రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘని, 2014, 2019, 2024లో నందమూరి బాలకృష్ణ వరసగా హ్యాట్రిక్ విజయాలను సాధించి నందమూరి సొంత నియోజకవర్గంగా మార్చుకున్నారు. వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా ఇక్కడ గెలుపు మాత్రం చిక్కడం లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.