తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు, ఈ సారి కీలక మార్పులు

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. విద్యార్ధుల పై భారం తగ్గించేలా కొత్త మార్పులతో పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సిద్దం అవుతోంది. గతానికి భిన్నంగా ఒక్కో పరీక్ష మధ్య ఒకటిరెండు రోజుల వ్యవధి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


దీని పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీబీఎస్ఈ పరీక్షల విధానం తరహాలో నిర్వహణ పైన ప్రతిపాదన లు రావటంతో..ఆ దిశగా కసరత్తు జరుగుతోంది.

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేసారు. ప్రభుత్వం ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు. కాగా, ఈసారి గతానికి భిన్నంగా ఒక్కో పరీక్ష మధ్య ఒకటిరెండు రోజుల వ్యవధి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండు మూడు రకాల షెడ్యూళ్లను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షల తేదీల ప్రకటనలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ రెండు షెడ్యూళ్ల లో ఒక దానికి ఆమోదం తరువాత అధికారికంగా తేదీలను ప్రకటించనున్నారు.

సీబీఎస్ఈ పరీక్షల విధానంలో ఎగ్జామ్స్ నిర్వహణలో వ్యవధి ఉంటుంది. అదే విధానాన్ని తెలంగాణలో పదో తరగతికి అమలు చేస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షల మధ్యలో వ్యవధి ఉండటం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకుంటా రని నిపుణులు సూచిస్తున్నారు. సీబీఎస్‌ఈ పది, 12 తరగతులకు ఒకేసారి పరీక్షలను నిర్వహిస్తోంది. సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్‌ను సెప్టెంబరు 24వ తేదీన విడుదల చేసింది.

పదో తరగతి పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పులు లేకుండా వరుసగా నిర్వహించటం ద్వారా విద్యార్ధుల పైన ఒత్తిడి ఉండదనే మరో వాదన ఉంది. దీంతో.. పరీక్షల మధ్య వ్యవధి ఇస్తూ ఒక షెడ్యూల్… గతం లో లాగానే కంటన్యూగా పరీక్షల నిర్వహణకు మరో షెడ్యూల్ సిద్దం చేసారు. పరీక్షల ప్రారంభం మాత్రం మార్చి 18గా ఖరారు చేసారు. ప్రభుత్వం తుది నిర్ణయంతో షెడ్యూల్ విడుదల కానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.