ప్రతి నెల చిట్టీ కట్టి బంగారం నగలు కొంటే లాభమా..? లేక పర్సనల్ లోన్ తీసుకొని బంగారు ఆభరణాలు కొంటే లాభమా..?

బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే మెజారిటీ కుటుంబాలలో గమనించవచ్చు.


భారతీయ కుటుంబాలలో వివాహాది మహోత్సవాలకు తప్పనిసరిగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చూస్తుంటాము. ముఖ్యంగా వివాహం జరిగినప్పుడు అమ్మాయికి వారి పుట్టింటి తరఫున బంగారు ఆభరణాలను కానుకలుగా అందిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయము. బంగారం ధర ఎంత ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో పసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు.

ప్రతి నెల చిట్టీ కట్టి బంగారం నగలు కొంటే లాభమా..? నష్టమా..?
అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి మార్కెట్లో అనేక రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది గోల్డ్ సేవింగ్స్ మంత్లీ స్కీమ్ (Gold Saving Scheme / Monthly Scheme) దీన్నే చిట్టి స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఈ స్కీములో ప్రతినెలా 11 నెలల పాటు నిర్ణీత మొత్తాన్ని గోల్డ్ షోరూమ్ లో చిట్టి రూపంలో కడతారు. ఆ తర్వాత 11 నెలల తర్వాత పోగు అయినా మొత్తంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల ఉన్న ప్రయోజనం ఏమిటంటే మీరు కొనుగోలు చేసిన బంగార ఆభరణాలు పైన మేకింగ్ చార్జెస్ లో డిస్కౌంట్ ఇస్తారు. అయితే ఈ స్కీము వల్ల లాభం ఏమిటంటే మీ వద్ద ఉన్నటువంటి డబ్బు ప్రతినెల ఈ విధంగా సేవ్ చేసుకోవడం వల్ల చివరకు మీకు బంగారం లభిస్తుంది. మీటింగ్ చార్జెస్ తగ్గుతాయి. ఇక ఈ స్కీము వల్ల ఉన్న నష్టం ఏమిటంటే బంగారం ధర అనేది ప్రతి నెల పెరుగుతుంది కనుక మీరు స్కీం ప్రారంభించినప్పుడు ఉన్న బంగారం ధర స్కీం ఎండింగ్ నాటికి భారీగా పెరిగినట్లు అయితే తక్కువ మొత్తంలో బంగారం లభిస్తుంది. మీకు ఇందులో తిరిగి క్యాష్ రూపంలో ఇవ్వరు. ఒకవేళ మీరు ఏదైనా ఆభరణం కొనుగోలు చేసి మీరు డిపాజిట్ చేసిన డబ్బు కన్నా ఎక్కువ ధర ఉన్నట్లయితే, ఆ మొత్తానికి స్కీం లో ఉన్నటువంటి ఆఫర్లు వర్తించవు. అయితే ఎవరైతే ఆర్థికంగా క్రమశిక్షణ కలిగిన వారు ఉంటారో వారు ఈ స్కీములో డబ్బులు దాచడం ద్వారా చివరకు చక్కగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.

పర్సనల్ లోన్ తీసుకొని బంగారభరణాలను కొంటె లాభమా నష్టమా ?
నిజానికి బంగారం ధర ప్రతినెల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి మీ వద్ద సరైన నిధులు లేకపోయినట్లయితే బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకొని కన్నా బ్యాంకులో పర్సనల్ లోన్ ద్వారా డబ్బు తీసుకొని తిరిగి చెల్లించుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని రిస్కులు ఉన్నాయి ముఖ్యంగా పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12 శాతం నుంచి ఏకంగా 18 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో బంగారం ధర కనుక తగ్గినట్లయితే మీరు వడ్డీ రూపంలో బంగారం అసలు విలువ కన్నా కూడా ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆప్షన్ వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సూచిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.