నిరుద్యోగులకు కొలువుల జాతర.. 3,445 ఉద్యోగాలకు RRB సీబీటీ-2 షెడ్యూల్ విడుదల

నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులకు గాను సీబీటీ-2 పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.


మొత్తం 11,558 ఖాళీల్లో 3,445 అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. CBT-1 పరీక్షలో క్వాలిఫై అయిన 51,978 మంది అభ్యర్థులకు CBT-2 పరీక్షకు అవకాశం లభించింది. మొత్తం దేశవ్యాప్తంగా 63,26,818 మంది అభ్యర్థులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. CBT-2 పరీక్షను 20 డిసెంబర్ 2025, ఆదివారం నిర్వహించనున్నారు.

ఇక ఆర్‌ఆర్‌బీ ప్రకటించిన 3,445 పోస్టులలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2,022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990, ట్రెయిన్స్ క్లర్క్ పోస్టులు 72 ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు విషయంలో కేటగిరీలవారీగా రిలాక్సేషన్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. CBT-1 పరీక్షలు ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 9, 2025 వరకు జరిగాయి. ఫలితాలు నవంబర్ 21, 2025న విడుదలయ్యాయి. CBT-2లో భాగంగా పోస్టులవారీగా టైపింగ్ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. CBT-2లో 100 ప్రశ్నలు (జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్) ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు. CBT-2 మార్కులే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.