ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్ .. చలికాలంలో రోజూ తాగితే ఎంత హాయో..

శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో మన శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాని వల్ల మనం త్వరగా సీజనల్ వ్యాధుల భారీన పడుతాం.


కాబట్టి ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకొని.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు కొన్ని పానియాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలు ఇవే

అల్లం, పసుపు టీ: అల్లం, పసుపుతో తయారు చేసిన టీ తాగడం వల్ల.. అది మన శరీరాన్ని లోపలి నుండి వేచ్చగా ఉంచుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. కాబట్టి ఈ శీతాకాలంలో ఈ టీ తాగండి.

పసుపు పాలు: పసుపు పాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతాయి. జలుబు వల్ల కలిగే ఛాతీ నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి రోజూ ఉదయం లేదా.. రాత్రి పడుకునే ముందు వీటిని తాగడం ఎంతో ఉత్తమంగా ఉంటుంది.

జీలకర్ర నీరు: శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి జీలకర్ర నీరు కూడా మంచి ఎంపిక. జీలకర్ర నీటిని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఆ నీటిని మరిగించి త్రాగాలి. ఇలా చేయడం ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

బెల్లం, జీలకర్ర నీరు: శీతాకాలంలో మీ శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడానికి, శరీర బలాన్ని కాపాడుకోవడానికి మీరు బెల్లం, జీలకర్ర నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు ఈ నీరు జీవక్రియను మెరుగుపర్చడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.