ఉత్తర కొరియా రాజకీయాల్లో మరోసారి ‘పర్ఫెక్ట్’ ఫలితాలు నమోదయ్యాయి. కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (WPK) ఇటీవల ముగిసిన ఎన్నికల్లో 99.91% ఓట్లతో విజయం సాధించింది.
ఓ రకంగా ఆయనపై వ్యతిరేకత కించిత్ పెరిగిందని అనుకోవాలి. గత ఎన్నికల్లో ఎన్నికల్లో 100% ఓట్లు పొందారు. ఈ సారి 0.09 శాతం వ్యతిరేకత వచ్చింది. ఈ ఫలితాలు నార్త్ కొరియా మీడియాలో ప్రకటించారు.
ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి చెందిన ఈ ఎన్నికలు గత వారంలో దేశవ్యాప్తంగా జరిగాయి. అధికారికంగా, 99.99% ఓటర్లు పాల్గొన్నారు, . WPK అభ్యర్థులకు దాదాపు అందరూ మద్దతు తెలిపారు. “ఇది ప్రజల స్వచ్ఛమైన మద్దతు” అని కిమ్ జాంగ్ ఉన్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. 0.09% మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది 2023 మార్చ్ ఎన్నికల్లో 100% మద్దతు పొందాు.
ఉత్తర కొరియా ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఒక అసాధారణ దృశ్యం. అభ్యర్థులు ముందుగానే ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఓటర్లకు ‘అవును’ లేదా ‘కాదు’ అనే ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. 2014 ఎన్నికల్లో WPKకు 100% ఓట్లు వచ్చాయి. 2019లో 99.99% టర్నౌట్ రికార్డు. 2023లో మొదటిసారిగా ‘దిసెంటింగ్ వోట్స్’ ప్రస్తావించారు. ఇది ప్రజాస్వామ్య ఇమేజ్ను పెంచడానికి మాత్రమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలు దేశంలోని ఆర్థిక సంక్షోభాల మధ్య జరిగాయి. కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ప్రకారం, ఓటర్లు ప్రియమైన నాయకుడు కిమ్ జాంగ్ ఉన్కు అచంచల మద్దతును” చూపారు. అయితే, అంతర్జాతీయంగా ఈ ఫలితాలు హాస్యాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో “అరుదైన 0.09% డిసెంట్” అనే హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతోంది. ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ ఫలితాలను ప్రజల స్వేచ్ఛా ఎంపిక గా ప్రజల్లో ప్రచారం చేస్తోంది. దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలు దీన్ని ఎన్నికలు కాదని అంటున్నాయి.
ప్రతి నియోజకవర్గంలో ఒకే ఒక అభ్యర్థి మాత్రమే ఉంటాడు. ఈ అభ్యర్థులను ముందుగానే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని మిత్రపక్షాలు కలిసిన ‘డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది రీయూనిఫికేషన్ ఆఫ్ కొరియా’ ఎంపిక చేస్తాయి. ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కొరియన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, చొండోయిస్ట్ చొంగు పార్టీ అవి కూడా WPKకు లోబడి ఉంటాయి. ఎవరూ పోటీ చేయడానికి అవకాశం లేదు. 17 ఏళ్లు పైబడిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఓటు రహస్యంగా ఉంటుందని రాజ్యాంగం చెప్పినప్పటికీ, వాస్తవంగా అలా కాదు. బ్యాలెట్ పేపర్లో ఒకే పేరు ఉంటుంది. ‘అవును’ అంటే దాన్ని మడతపెట్టి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ‘కాదు’ అంటే పేరును గీత క్రాస్ చేసి వేయాలి. కానీ ఇలా చేయడానికి ప్రత్యేక బూత్ ఉంటుంది. అక్కడికి వెళ్లడం వల్ల పరిశీలకులు గమనిస్తారు. దీని వల్ల వ్యతిరేక ఓటు వేసినవారికి కఠిన శిక్షలు పడతాయి.గతంలో క్రాస్ చేయడం ద్వారా వ్యతిరేకత చూపేవారు. కానీ 2023లో ఎన్నికల చట్టం సవరణ తర్వాత కొన్ని స్థానిక ఎన్నికల్లో రెండు రంగుల బ్యాలెట్ బాక్స్లు ప్రవేశపెట్టారు.
































