రోజువారీ ఆహారంలో ఈ మార్పులు చేయండి.. బరువుతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయట

మనం రోజూ తినే ఫుడ్ కడుపు నిండిన, తృప్తి ఫీలింగ్ ఇచ్చినా.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో విఫలం కావచ్చు.


హెల్తీగా తినడం అంటే.. కఠినమైన డైట్స్ ఫాలో అవ్వడం, ఇష్టమైన ఆహారాలను వదులుకోవడం కాదు. దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మైండ్ఫుల్ అలవాట్లను ఫాలో అవ్వడం. చిన్న చిన్న మార్పులు.. శరీరం శక్తివంతంగా, సమతుల్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. రోజువారీ జీవితంలో ఈ మార్పులు చేస్తే.. ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

అల్పాహారంలో పోషకాలు

అల్పాహారం మొత్తం డేను టోన్ చేస్తుంది. సుదీర్ఘ రాత్రి ఉపవాసం తర్వాత.. శరీరానికి శక్తి, అవసరమైన పోషకాలను బ్రేక్​ఫాస్ట్ రూపంలో అందించాలి. కాబట్టి దాన్ని స్కిప్ చేయకండి. చాలామంది బ్రేక్​ఫాస్ట్ మానేస్తారు. ఇది ఫ్యూచర్​లో హానికరం కావచ్చు. సరైన బ్రేక్​ఫాస్ట్ తీసుకుంటే ఇతర క్రేవింగ్స్ తగ్గుతాయి. రోజంతా యాక్టివ్​గా ఉంటారు. ఓట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ వంటివాటితో బ్రేక్​ఫాస్ట్ చేసుకుంటే మంచిది.

ఫైబర్-రిచ్ స్టేపుల్స్

పిండి పదార్థాలు రోజువారీ పోషకాహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అధిక-ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శక్తిని అందిస్తుంది. కాబట్టి మధ్యాహ్న భోజనంలో కేలరీలను జోడించకుండా ఫైబర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇవి తక్కువ కేలరీలతో కడుపు నింపుతాయి.

పండ్లు, కూరగాయలతో..

పండ్లు, కూరగాయలు రోజువారీ భోజనంలో ఉండేలా చూసుకోండి. ఇవి తాజాదనంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోజంతా వాటిని తినడం వల్ల సంతృప్తిగా ఉంటుంది. ఇతర క్రేవింగ్స్ ఉండవు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని హాయిగా తీసుకోవచ్చు.

చేపలు మరచిపోవద్దు

చేపలు శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు ప్రోటీన్​ను అందిస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పూర్తి శ్రేయస్సుకు మద్దతు లభిస్తుంది. మితంగా, సరైన పద్ధతిలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ఫ్యాట్స్, షుగర్స్ ఎంపిక

ఫ్యాట్స్ శరీరానికి అవసరమైనప్పటికీ.. వాటి రకం, పరిమాణం ముఖ్యం. సంతృప్త కొవ్వులను పరిమితం చేయడం, తేలికైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదేవిధంగా చక్కెర ఆహారాలు, డ్రింక్స్ తగ్గిస్తే మంచిది. బరువు పెరగడం, దంత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఉప్పు నియంత్రణ

ప్యాక్ చేసిన ఫుడ్స్​లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. నిల్వ చేయడం కోసం ఎక్కువగా ఉప్పు వాడేస్తారు. వాటిని తినేస్తూ ఉంటే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం కావాలనుకుంటే.. తక్కువ-ఉప్పు ఉన్నవాటిని ఎంచుకోవాలి.

తేలికపాటి వ్యాయామం

క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేస్తే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఫలితాలు మంచిగా ఉంటాయి. బరువు తగ్గడానికి, మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తాయి. శరీరాన్ని కదిలిస్తూ మైండ్ఫుల్గా తినడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు దూరమవుతాయి.

హైడ్రేషన్ చాలా ముఖ్యం..

శరీరం బాగా పనిచేయడానికి తగినంత నీరు తాగడం అవసరం. నీటితో పాటు ఇతర తక్కువ-చక్కెర కలిగిన డ్రింక్స్ తీసుకోవచ్చు. ఇవి డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడతాయి. రోజువారీ శక్తి స్థాయిలకు మద్దతు ఇస్తాయి.

రోజూవారి ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. వీటిని ఫాలో అయితే మంచిఫలితాలు చూడగలుగుతారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.