శుభవార్త..ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.

ఇటీవల అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, అలాగే గతంలో గృహ జ్యోతి కింద మంజూరు చేసిన ఇండ్లను పూర్తి చేయాలని ఇతర పార్టీ ల ఎం ఎల్‌ ఏ ఏ లు కోరారని, వాటిని కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే కమిషన్‌ వస్తుందని ఆలోచించింది తప్ప పేదవాడికి ఇండ్లు కట్టించలేదన్నారు. అంతేకాక గృహ నిర్మాణ శాఖను అస్తవ్యస్తం చేసిందని అన్నారు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.