5520ఎంఏహెచ్ బ్యాటరీ, 20ఎంపీ సెల్ఫీ కెమెరా, 50ఎంపీ డ్యూయెల్ రేర్ కెమెరాతో కూడిన పోకో ఎం8 5జీ స్మార్ట్‌ఫోన్‌ని సంస్థ లేటెస్ట్గా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర కూడా తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్లు సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
తన “ఎం” సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలోకి తీసుకొచ్చింది ప్రముఖ టెక్ సంస్థ పోకో. అదే పోకో ఎం8 5జీ. ఇందులో ఆక్టా-కోర్ చిప్సెట్, 4ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. పెద్ద డిస్ప్లే, 50ఎంపీ డ్యూయెల్ కెమెరా వంటి ఫీచర్లు కూడా దీని సొంతం. అంతేకాదు, ఈ స్మార్ట్‌ఫోన్ తన సెగ్మెంట్లోనే చాలా స్లిమ్ (7.35ఎంఎం). దీని బరువు 178గ్రాములు.
మీరు ఒకవేళ పోకో ఎం8 కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పోకో ఎం8 5జీ- ఫీచర్లు..
పోకో ఎం8 5జీలో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్‌సెట్‌లో 4 కోర్టెక్స్- ఏ78 కోర్స్, 4 కోర్టెక్స్-ఏ55 కోర్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో కనెక్ట్ చేసి ఉంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 ఇంచ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటివి దీని సొంతం. 3200 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్న ఈ పోకో ఎం8 5జీలో కళ్ల రక్షణ కోసం ట్రిపుల్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, లో- బ్లూ లైట్ సపోర్ట్ వంటివి ఉన్నాయి.
ఈ పోకో ఎం8 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,520ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. 18డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ డ్యూయెల్ రేర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇందులో ఐపీ65- ఐపీ66 రేటింగ్ కూడా లభిస్తోంది.
పోకో ఎం8 5జీ- ధర, లభ్యత..
పోకో ఎం8 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ర రూ. 18,999గాను, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 19,999గాను, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 21,999గాను ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గ్యాడ్జెట్‌ని జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. కార్బన్ బ్లాక్, ఫ్రాస్ట్ సిల్వర్, గ్రేషియల్ బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.



































