మధ్యతరగతి ప్రజల లగ్జరీ కారు మహీంద్రా XUV 7XO- బేస్​ వేరియంట్​లోనే అదిరే ఫీచర్లు.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ ఎస్​యూవీ బేస్​ వేరియంట్​, దాని ఫీచర్లు, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి

మహీంద్రా ఎక్స్​యూవీ 700కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ అయిన ఎక్స్​యూవీ 7ఎక్స్ఓని దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. దీనిని మధ్యతరగతి ప్రజల లగ్జరీ కారు అని అభివర్ణిస్తున్నారు. ఇందులో అనేక అదిరిపోయే ఫీచర్లు ఉండటం ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా ఈ ఎస్​యూవీ బేస్​ వేరియంట్​ కూడా ఫీచర్స్​తో వస్తోంది! మీరు ఒకవేళ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓని కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఈ బేస్​ వేరియంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..


మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బేస్​ వేరియంట్​ ఫీచర్లు..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బేస్​ వేరియంట్​ పేరు “ఏఎక్స్​”. ఇందులోని ఫీచర్లు..

  • క్లియర్​ లెన్స్​ ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​
  • పియానో బ్లాక్​ క్లాడింగ్​
  • ఫుల్​ సైజ్డ్​ వీల్​ కవర్​తో కూడిన ఆర్​17 స్టీల్​ వీల్స్
  • కోస్ట్​ టు కోస్ట్​ ట్రిపుల్​ 12.5 ఇంచ్​ హెచ్​డీ స్క్రీన్స్​
  • 6-స్పీకర్​ ఆడియో సిస్టెమ్​
  • ఇంటెలిజెంట్​ అడ్రినోక్స్​
  • స్మార్ట్​వాచ్​ కనెక్టివిటీ
  • అలెక్సా బిల్ట్​-ఇన్​ విత్​ చాట్​జీపీటీ
  • వైర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో అండ్​ కార్​ప్లే
  • ఫ్రాంట్​ టైప్​ సీ 65డబ్ల్యూ, 15డబ్ల్యూ టైప్​ ఏ-యూఎస్​బీ
  • రేర్​ టైప్​ సీ 65డబ్ల్యూ యూఎస్​బీ
  • థర్డ్​ రో 12వీ ఛార్జింగ్​ పోర్ట్​
  • క్రూయిజ్​ కంట్రోల్​
  • బై-ఎల్​ఈడీ ప్రొడెక్టర్​ హెడ్​ల్యాంప్స్​ విత్​ డీఆర్​ఎల్​
  • థర్డ్​ రో ఏసీ వెంట్స్​
  • డ్రైవ్​ మోడ్​- జిప్​, జ్యాప్​, జ్యూమ్​ (డీజిల్​ వేరియంట్​లో మరిన్ని కస్టమ్​ ఆప్షన్స్​)
  • ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్​ ఓఆర్​వీఎం
  • షార్క్​ పిన్​ యాంటీనా
  • స్మార్ట్​ డోర్​ హ్యాండిల్స్​
  • ఫ్రెంట్​ ఆర్మ్​రెస్ట్​ విత్​ స్టోరేజ్​
  • డే అండ్​ నైట్​ ఐఆర్​వీఎం
  • మైక్రో హైబ్రీడ్​ టెక్నాలజీ
  • రేర్​ ఏసీ వెంట్స్​ (2-3 రోలకు)
  • రూఫ్​ రెయిల్స్​ అండ్​ రేర్​ స్పాయిలర్స్​
  • ఎలక్ట్రిక్​ పవర్​ స్టీరింగ్​
  • పుష్​ బటన్​ స్టార్ట్​
  • కో-డ్రైవర్​ సన్​విజర్​ విత్​ మిర్ర్​
  • రేర్​ సెంటర్​ ఆర్మ్​రెస్ట్​ విత్​ కప్​ హోల్డర్​
  • 6-వే మేన్యువల్​ డ్రైవర్​ సీట్​ అడ్జెస్ట్​మెంట్​
  • హైట్​-అడ్జెస్టెబుల్​ డ్రైవర్​ అండ్​ కో-డ్రైవర్​ సీట్​ బెల్ట్స్​
  • 4 పవర్​ విండోలు
  • వన్​-టచ్​ డౌన్​ డ్రైవర్ డోర్​ పవర్ విండో

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బేస్​ వేరియంట్​ భద్రతా ఫీచర్లు..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీ ఏఎక్స్​ వేరియంట్‌లో ప్రామాణికంగా లభించే సేఫ్టీ ఫీచర్లు ఇవే:

ఎయిర్‌బ్యాగ్‌లు: డ్రైవర్, కో-డ్రైవర్ తో పాటు సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో కలిపి మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో ఉన్నాయి.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ): డ్రైవింగ్ సమయంలో కారుపై పూర్తి నియంత్రణ కోసం 17 రకాల ఫీచర్లతో కూడిన ఈఎస్​సీ సిస్టమ్ ఇందులో ఉంది.

బ్రేకింగ్ సిస్టమ్: యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్​), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ) సాంకేతికతను అందించారు.

హిల్ కంట్రోల్: కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్‌ను సులభతరం చేసే ‘హిల్ హోల్డ్’, ‘హిల్ డిసెంట్’ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని ఫీచర్లు: చిన్న పిల్లల భద్రత కోసం ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, ఫాలో మీ హెడ్‌ల్యాంప్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బేస్​ వేరియంట్​ ఇంజిన్..

ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఏఎక్స్​ వేరియంట్ పెట్రోల్, డీజిల్.. రెండు ఆప్షన్లలోనూ లభిస్తుంది.

2.0-లీటర్ టర్బో పెట్రోల్: ఇది 200 బీహెచ్​పీ పవర్‌ను, 380 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2.2-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 182 బీహెచ్​పీ పవర్‌ను, 420 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది.

అయితే, ఈ ఏఎక్స్​ వేరియంట్‌లో కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (6-స్పీడ్ టార్క్ కన్వర్టర్) కావాలనుకుంటే, మీరు దీని పై వెర్షన్ అయిన ఏఎక్స్​3 వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ధరలు..

సీటింగ్ విషయానికి వస్తే, మహీంద్రా ప్రస్తుతం ఈ బేస్ వేరియంట్‌ను కేవలం 7-సీటర్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తోంది. గతంలో ఉన్న 5-సీటర్ వెర్షన్‌ను కంపెనీ నిలిపివేసింది. అలాగే ఇందులో 6-సీటర్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ధరలు (ఎక్స్-షోరూమ్):

  • పెట్రోల్ వేరియంట్: రూ. 13.66 లక్షలు.
  • డీజిల్ వేరియంట్: రూ. 14.96 లక్షలు.

మొత్తానికి, బడ్జెట్ ధరలో శక్తివంతమైన ఇంజిన్, అద్భుతమైన భద్రతా ఫీచర్లు కావాలనుకునే వారికి మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఏఎక్స్​ బేస్​ వేరియంట్​ ఒక సరైన ఎంపిక అని మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.