కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా మనతో లేరు . కానీ ఆయన చేసిన లు, సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం. బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో వెలుగుతూ, హీరోగా ప్రజల హృదయాలను గెలుచుకున్న పునీత్ సామాజిక సేవ ద్వారా కూడా మంచి గుర్తింపు పొందారు.
ఆయన సాధించిన విజయాల కథ చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. మరణానంతరం ‘కర్ణాటక రత్న’ అవార్డు పొందిన పునీత్ రాజ్ కుమార్ జీవిత కథను ఇప్పుడు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు . దాని కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. పాఠ్యపుస్తకాల సవరణ సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ‘టెక్స్ట్‌బుక్ అసోసియేషన్’ నిర్ణయించింది. అంటే, రాబోయే రోజుల్లో, పునీత్ రాజ్‌కుమార్ విజయాలను కర్ణాటకలోని పాఠశాలల పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు. తద్వారా తరువాతి తరానికి పునీత్ రాజ్‌కుమార్ గురించి తెలియనుంది.
పునీత్ రాజ్ కుమార్ మార్చి 17, 1975న జన్మించారు. బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘హెట్టడ హూవు’ చిత్రానికి ‘ఉత్తమ బాలనటుడు’గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2002లో ‘అప్పు’ చిత్రం ద్వారా హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పునీత్ రాజ్ కుమార్ 30 కి పైగా ల్లో హీరోగా నటించారు. అనేక విభిన్న పాత్రలు పోషించి అభిమానులను అలరించారు. ద్వారానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఆయన ప్రజలకు చేరువయ్యారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ పాఠ్యపుస్తకం ద్వారా తదుపరి తరానికి తెలియజేయనున్నారు.
ఈ విషయంపై అశ్విని పునీత్ రాజ్ కుమార్ స్పందించారు. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గౌరవం ఇచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇది ఒక తండ్రికి లభించిన అతిపెద్ద గౌరవమని మా పిల్లలకు తెలుసు. పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ ఈ రకమైన గౌరవం అందరికీ అందుబాటులో ఉండదు’ అని అశ్విని పేర్కొంది.


































