అందరికీ ఇష్టమైన కారు.. అమాంతం పెరిగిన ధరలు

జనవరి ప్రారంభం నుంచి చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగానే.. టయోటా కంపెనీ తన ఇన్నోవా క్రిస్టా ధరలను సవరించింది.


ధరల పెరుగుదల రూ.21,000 నుంచి రూ.33,000 మధ్య ఉంది.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్‌ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్‌లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి.

ధరల పెరుగుదల తరువాత.. టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్‌లైన GX సెవెన్ & ఎనిమిది సీటర్ వేరియంట్‌ల ధర ఇప్పుడు రూ. 18.66 లక్షల నుంచి రూ. 18.99 లక్షలకు(ఎక్స్-షోరూమ్) చేరింది. GX+ సెవెన్ & ఎనిమిది సీటర్ మోడళ్ల ధర వరుసగా రూ. 20.47 లక్షలు & రూ. 20.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా వస్తుంది.

ఏడు, ఎనిమిది సీట్ల VX మోడళ్ల ధరలు వరుసగా రూ. 23.95 లక్షలు & రూ. 24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్-ఎండ్ ZX ఏడు సీట్ల మోడల్ ధర ఇప్పుడు రూ. 25.27 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 25.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.