ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan ) నేతృత్వంలోని జనసేన ( Jana Sena ) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది . తెలంగాణలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipality elections ) పోటీకి నిర్ణయం తీసుకుంది.
త్వరలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కార్యాచరణ రూపొందిస్తుందని జనసేన వెల్లడించింది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిందని తెలియజేసింది . 2019 ఎన్నికలలో నేరుగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినా, కేవలం ఒక సీటు మాత్రమే గెలిచింది. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి స్థాపించి, 21 సీట్లకు గాను 21 సీట్లు గెలిచి వందశాతం స్ట్రైక్ రేటు సాధించించి. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందింది.


































