మారుతీ సుజుకీ సంస్థ నుంచి అదిరిపోయే వార్త! తన నెక్సాన్ లైనప్‌లోని అనేక బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ఇగ్నిస్ నుంచి ఇన్విక్టో వరకు ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి..
సంక్రాంతి 2026కి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మారుతీ సుజుకీ బంపర్ న్యూస్‌ని ప్రకటించింది. తన నెక్సా లైనప్‌లోని వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్లు, ఆఫర్లను సంస్థ ఇస్తోంది. ఇగ్నిస్, బలెనో, సియాజ్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, జిమ్నీ, ఇన్విక్టోపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, కార్పొరేట్ ఆఫర్స్ వంటివి ఇస్తున్నట్టు వివరించింది.
ఫలితంగా వెహికిల్ వేరియంట్ బట్టి మీరు రూ. 20వేల నుంచి ఏకంగా రూ. 1లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జనవరి 2026లో, సంక్రాంతి వేళ మారుతీ సుజుకీ ఆఫర్లను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ ఇగ్నిస్-
| Variant | Consumer Offer | Exchange Bonus | Scrappage Bonus | Corporate Offer | Total Benefit |
|---|---|---|---|---|---|
| All Variants — MT | ₹10,000 | ₹15,000 | ₹30,000 | — | ₹40,000 |
| All Variants — AGS | ₹15,000 | ₹15,000 | ₹30,000 | ₹5,000 | ₹45,000 |
మారుతీ సుజుకీ ఇగ్నిస్‌పై క్యాష్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. మేన్యువల్ వేరియంట్ కన్నా ఏజీఎస్ వేరియంట్లపై మరింత తగ్గింపులను పొందవచ్చు.
మారుతీ సుజుకీ బలెనో-
| Variant | Consumer Offer | Exchange Bonus | Scrappage Bonus | Corporate Offer | Total Benefit |
|---|---|---|---|---|---|
| Sigma MT (P) | ₹10,000 | ₹15,000 | ₹25,000 | ₹5,000 | ₹40,000 |
| All Except Sigma MT (P) | ₹10,000 | ₹15,000 | ₹25,000 | ₹5,000 | ₹40,000 |
| All Variants — AGS | ₹15,000 | ₹15,000 | ₹25,000 | ₹5,000 | ₹45,000 |
| All Variants — CNG | ₹10,000 | ₹15,000 | ₹25,000 | ₹5,000 | ₹40,000 |
మారుతీ సుజుకీ బలెనోలోని పెట్రోల్, ఏజీఎస్, సీఎన్జీ వేరియంట్లన్నింటికీ ఈ ఆఫర్లు వస్తుండటం విశేషం. ఎంట్రీ లెవల్ నుంచి హై అండ్ వరకు గరిష్ఠంగా రూ. 45వేల వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.
మారుతీ సుజుకీ సియాజ్-
| Variant | Consumer Offer | Exchange Bonus | Scrappage Bonus | Corporate Offer | Total Benefit | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| All Variants | ₹10,000 | ₹25,000 | ₹30,000 | ₹5,000 | ₹40,000
మారుతీ సుజుకీ సియాజ్‌లోని అన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ. 40వేల వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ వంటివి ఉన్నాయి. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్-
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ టర్బో వేరియంట్లపై అధిక డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇతర వేరియంట్లతో పోల్చితే వీటికి రూ. 10వేల అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా-
మారుతీ సుజుకీకి బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న గ్రాండ్ విటారాపై సంస్థ ఈసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. పెట్రోల్, సీఎన్జీ, స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్లకు ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్లపై రూ. 1.25లక్షల వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6-
మారుతీ సుజుకీ ఎక్స్ ఎల్6పై రూ. 35వేల వరకు తగ్గింపులను పొంవచ్చు. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లకు ఇవి వర్తిస్తాయి. మారుతీ సుజుకీ జిమ్నీ, ఇన్విక్టోపై ఆఫర్లు ఇలా..మారుతీ సుజుకీ జిమ్నీ-
మారుతీ సుజుకీ ఇన్విక్టో-
|































