ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి, టాలీవుడ్‌లో తిరుగులేని ‘మెగాస్టార్’గా ఎదిగిన చిరంజీవి ప్రస్థానం కేవలం ఒక వెండితెర విజయం మాత్రమే కాదు, అద్భుతమైన బిజినెస్ పాఠాల సమాహారం. ఆయన జీవితం నుంచి ప్రతి వ్యాపారవేత్త నేర్చుకోవాల్సిన 5 కీలక అంశాలను ఇక్కడ తెలుసుకోండి..
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం కేవలం వెండితెర అద్భుతం మాత్రమే కాదు, అది ఒక గొప్ప ‘బిజినెస్ కేస్ స్టడీ’! ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, సున్నా నుంచి కోట్ల సామ్రాజ్యాన్ని అధిపతిగా ఎదిగిన ఆయన ప్రయాణంలో ప్రతి ఎంట్రప్రెన్యూర్‌కు సరిపడా పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందుకే, ‘మన శంకర వరప్రసాద్’ జీవితం నుంచి పవర్‌ఫుల్ బిజినెస్ పాఠాలు మీకోసం..
చిరంజీవి నుంచి నేర్చుకోవాల్సిన 5 బిజినెస్ పాఠాలు..
1. రీ-ఇన్వెన్షన్: మార్కెట్ ట్రెండ్‌ను ముందే పసిగట్టడం-
వ్యాపారంలో మొట్టమొదటి సూత్రం – మార్పును ఆహ్వానించడం! చిరంజీవి వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే కేవలం మాటలు, పాటలు. కానీ ఆయన ‘బ్రేక్ డ్యాన్స్’, ‘మార్షల్ ఆర్ట్స్’, ‘స్టైలిష్ ఫైట్స్’ను పరిచయం చేశారు.
మీ ప్రొడక్ట్ లేదా సర్వీస్ మిగతా వాటికన్నా భిన్నంగా లేకపోతే, మీరు రేసులో నిలబడలేరు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని జోడిస్తూ, కస్టమర్లను ఆశ్చర్యపరచడమే అసలైన సక్సెస్.
2. బ్రాండ్ బిల్డింగ్: పర్సనాలిటీయే ఒక పవర్-
చిరంజీవి ఒక నటుడిగానే కాకుండా ఒక నమ్మకమైన బ్రాండ్‌గా ఎదిగారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ‘మెగాస్టార్’ అనే బ్రాండ్ వాల్యూతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
అదే విధంగా వ్యాపారంలో నమ్మకం అనేది అతిపెద్ద పెట్టుబడి. మీ కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేయండి. ఆ బ్రాండ్ వినగానే నాణ్యత గుర్తొచ్చేలా చేయడమే మీ లక్ష్యం కావాలి.
3. సంక్షోభ నిర్వహణ: ఓటమిని ఆయుధంగా మార్చుకోవడం-
ఒక నటుడిగా చిరంజీవి వరుసగా ఫ్లాపులు వచ్చిన రోజులు ఉన్నాయి, రాజకీయాల్లో ఆశించిన ఫలితాలు రాని సమయాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. ప్రతి విమర్శను తన విజయానికి మెట్టుగా మార్చుకున్నారు.
బిజినెస్ అంటేనే రిస్క్. నష్టాలు వచ్చినప్పుడు భయపడి వెనకడుగు వేయకూడదు. ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుని, మరింత బలంగా కమ్‌బ్యాక్ ఇవ్వాలి.
4. టీమ్ వర్క్ అండ్ నెట్‌వర్కింగ్: అందరినీ కలుపుకుపోవడం-
మన శంకర వరప్రసాద్ గారు ఎప్పుడూ తన సహచర నటులను, దర్శకులను, ముఖ్యంగా తన టీమ్‌ను ఎంతో గౌరవిస్తారు. అందుకే ఒక నటుడిగానే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా ఆయన్ని అందరు గుర్తిస్తారు. అందుకే నాలుగు దశాబ్దాలుగా పరిశ్రమలో తిరుగులేని నాయకుడిగా ఆయన కొనసాగుతున్నారు.
అంటే.. ఒంటరిగా మీరు పరుగెత్తగలరు, కానీ కలసిగట్టుగా మాత్రమే మీరు శిఖరాలను చేరుకోగలరు. మంచి నెట్‌వర్క్ నిర్మించుకోవడం, టీమ్‌లో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం గొప్ప లీడర్ లక్షణం.
5. సామాజిక బాధ్యత-
చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఆయన సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారు. తనని మెగాస్టార్‌గా నిలబెట్టిన అభిమానులకు ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇది ఆయన పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసింది.
అంటే.. మీరు సమాజం నుంచి లాభాలు పొందుతున్నప్పుడు, తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయడం వల్ల మీరు జీవితంలో ఒక మెట్టు ఎదుగుతారు. మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. మీ బ్రాండ్ విలువ పెరుగుతుంది.
వ్యాపారంలో కూడా కస్టమర్లు కేవలం మీ ప్రొడక్ట్‌నే కాదు, మీ విలువలను కూడా కొంటారు. అందుకే టాటా సంస్థ పేరు వినగానే అందరిలోనూ ఒక గౌరవభావం కనిపిస్తుంది.
‘మన శంకర వరప్రసాద్’గా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ప్రయాణం మనకు ఒకటే చెబుతోంది– “మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్లాలని బలంగా ఫిక్స్ అయ్యారు అనేదే ముఖ్యం.” కష్టపడటం చిరంజీవికి తెలుసు, అందుకే అదృష్టం ఆయన ఇంటి తలుపు తట్టింది. మీరు కూడా మీ వ్యాపారంలో మెగాస్టార్ కావాలంటే.. అంకితభావం అనే ఆయుధాన్ని పట్టుకోవాల్సిందే!

































