మిడ్ రేంజ్ పీపుల్స్ ఫోన్ కొనే సమయంలో తక్కువ ధర ఉండే మొబైల్స్ వైపు చూస్తారు. అయితే కొందరికి లేటెస్ట్ ఫీచర్స్ కావలసి ఉండి.
తక్కువ ధర చెల్లించాలని అనుకుంటారు. ఇలాంటి వారికి Realme కంపెనీ అనుగుణంగా మొబైల్స్ ను తీసుకువస్తూ ఉంటుంది. 2026 కొత్త సంవత్సరంలో ఈ కంపెనీ కొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకువస్తుంది. దీని గురించిన సమాచారం పూర్తిగా లేకపోయినప్పటికీ కొన్ని అంచనాల ప్రకారం ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చెబుతున్నారు. అంతేకాకుండా తక్కువ ధరతో మొబైల్ కొనుగోలు చేయాలని వారికి ఇది బెస్ట్ ఫోన్ అని అంటున్నారు. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?
ప్రస్తుత కాలంలో ప్రతి ఫోన్లో కెమెరా గురించి ప్రధానంగా ఆరాధిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే రియల్ మీ స్మార్ట్ ఫోన్ లో 200 MP కెమెరా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కెమెరా అడ్వాన్స్ టెక్నాలజీ తో AI తరహాలో ఫోటోగ్రఫీని అందిస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా మెగా పిక్సెల్ తక్కువగా ఉన్నప్పటికీ.. సెల్ఫీ ఫోటోలతో పాటు.. వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా కెమెరాను ఉంచుతారని అంటున్నారు. అలాగే సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారితోపాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి కూడా ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.
కొత్తగా వచ్చే మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని తెలుస్తోంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయనుంది. అలాగే సాఫ్ట్ టచ్ ఉండడంతో నాణ్యమైన వీడియోలను అద్భుతమైన అనుభూతితో వీక్షించవచ్చు. ఈ డిస్ప్లే హై పిక్ బ్రైట్నెస్ తో కలిగి ఉండడంతో పగలు, రాత్రి అనే సమయం లేకుండా ఏ వాతావరణంలో నైనా కావాల్సిన బ్రైట్నెస్ను అందిస్తుంది.
ఈ కొత్త మొబైల్ లో బ్యాటరీ మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మొబైల్లో 700 mAh బ్యాటరీని చేర్చనున్నారు. ఇది 100 W నుంచి 180 W వరకు ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. రోజువారి వినియోగదారులతో పాటు మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి చార్జింగ్ ఇబ్బంది లేకుండా రోజంతా ఉంటుంది. అలాగే బిజీగా ఉండే వారికి వెంటనే చార్జింగ్ కావాలని కోరుకునే వారికి ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వండి.
రియల్ మీ మొబైల్ లో 16 GB రామ్ ఉండనుంది. దీంతో గేమింగ్ కోరుకునే వారికి ఫాస్టెస్ట్ గా స్క్రోలింగ్ చేసుకొని అవకాశం ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 5g ఫాస్ట్ కనెక్టింగ్ తో పాటు వైఫై సపోర్టు ఉండటంతో ఇంటర్నెట్ సమస్య లేకుండా వినియోగించుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ను అమర్చనున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.10,000 నుంచి రూ.16,000 తో విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.



































