రూ.1499కే విమాన ప్రయాణం.. ఇండిగో సంక్రాంతి స్పెషల్ సేల్

సంక్రాంతి పండగ సందర్భంగా విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) స్పెషల్ సేల్ తీసుకొచ్చింది.


తమ కస్టమర్లకు స్పెషల్ ఆల్ ఇన్‌క్లూసివ్ వన్-వే ఫేర్స్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలోనూ ఈ స్పెషల్ ధరల ద్వారా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. కేవలం రూ.1499కే విమాన ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ సేల్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి. మరి ఇండిగో సెయిల్ ఇంటూ 2026 సేల్ (Sail Into 2026) ప్రత్యేక ఆఫర్ గురించి తెలుసుకుందాం.

సెయిల్ ఇంటూ 2026 స్పెషల్ సేల్ జనవరి 13, 2026 నుంచి జనవరి 16,2026 అర్ధరాత్రి 23:59 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి దేశీయ మార్గాల్లో కనీస టికెట్ ధర రూ.1499 నుంచే మొదలవుతోంది. ఇక ఇంటర్నేషనల్ రూట్లలో రూ.4499కే విమాన ప్రయాణం లభిస్తోంది. ఎంపిక చేసిన రూట్లకు ఈ కనీస ధర ఉంటుంది. అలాగే ఈ ఆఫర్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 20, 2026 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అయితే, బుకింగ్ చేసుకునే సమయానికి ప్రయాణం సమయం 7 రోజుల వ్యవధి ఉండాలే చూసుకోవాల్సి ఉంటుంది.

ఇండిగో స్పెషల్ సేల్ ద్వారా తక్కువ ధరకే విమాన టికెట్లు పొందాలనుకునే వారు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ (www.goindigo.in) లేదా ఇండిగో మొబైల్ యాప్ లేదా ఇండిగో 6ESkai లేదా ఇండిగా వాట్సాప్ 7065145858 లేదా ఎంపిక చేసిన ట్రావెల్ పార్ట్నర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ సమయంలో డొమెస్టిక్ సెక్టార్లో టికెట్ ధర రూ.1499 నుంచి మొదలవుతుండగా ఇంటర్నేషనల్ సెక్టార్లలో రూ.4499 నుంచి మొదలవుతోంది. ఇది వన్-వే ఫేర్ మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

హైదరాబాద్ నుంచి కూడా ఫ్లైట్స్

హైదరాబాద్ ప్రయాణికులకు సైతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి ఢాకాకు రూ.4499కే ప్రయాణం చేయవచ్చు. అలాగే మస్కట్ నుంచి హైదరాబాద్ రూట్ అయితే రూ.7799గా టికెట్ రేటు ఉంది. దేశీయ మార్గానికి వస్తే చెన్నై- విశాఖపట్నం మధ్య రూ.1499కే విమాన ప్రయాణం చేయొచ్చు. అలాగే ముంబై, కొచ్చి, లఖ్‌నవూ, కోల్‌కతా, ఢిల్లీ నుంచి సైతం దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఈ స్పెషల్ సేల్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలకు ఇండిగో అధికారిక వెబ్‌సైట్లోని స్పెషల్ లిమిటెడ్ ఆఫర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.