ఇండియాలో ఇప్పుడు ఫ్లైట్ జర్నీ లగ్జరీ కాదు. తరచూ విమానంలో ట్రావెల్ చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో SBI కార్డ్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ వంటి మేజర్ బ్యాంకులు తమ డెబిట్, క్రెడిట్ కార్డ్ రూల్స్‌ని అప్‌డేట్ చేశాయి.
ఈ చేంజెస్‌తో ప్రధానంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, స్పెండింగ్ లిమిట్స్, రివార్డులు, కొన్ని ఛార్జీలు ప్రభావితం అవుతాయి. ఈ అప్‌డేట్స్ జనవరిలో వేర్వేరు తేదీల్లో అమల్లోకి వస్తున్నాయి. అంటే తరచుగా ప్రయాణించే కార్డ్ హోల్డర్లు ఇమ్మీడియట్‌గా ఛేంజెస్ ఎదుర్కోబోతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇన్‌కన్వీనియన్స్ ఎదురు కాకుండా ఉండాలంటే కొత్త రూల్స్ (Bank rules) ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది.
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులు
2026 జనవరి 15 నుంచి సెలక్టెడ్ క్రెడిట్ కార్డ్స్‌లో వచ్చే మార్పులని ICICI బ్యాంక్ ప్రకటించింది. అప్‌డేట్స్‌లో రివార్డ్ పాయింట్లు, బెనిఫిట్స్, కొన్ని ఫీజులు ఉన్నాయి. అంటే స్పెసిఫిక్ స్పెండ్స్‌పై రివార్డ్స్ మారుతాయి. ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ బెనిఫిట్స్ చేంజ్ అవుతాయి. ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్లు, డే టూ డే పేమెంట్ ఛార్జీలు కూడా అప్‌డేట్ అవుతాయి. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు వీటిని జాగ్రత్తగా రివ్యూ చేయాలి. ఎందుకంటే అవి భవిష్యత్తులో మొత్తం ఖర్చు, ప్రయోజనాలను ప్రభావితం చేయవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా మనీ సేవింగ్ టిప్స్ గురించి ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? మీ ప్రశ్నను ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ నుండి సమాధానాలు పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రశ్నలకు సమాధానాలను మా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రూపంలో మరుసటి రోజు చూడొచ్చు.
SBI కార్డ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ నెట్‌వర్క్
SBI కార్డ్ 2026 జనవరి 10 నుంచి అమలులోకి వచ్చే విధంగా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు ప్రవేశపెట్టింది. కొత్త సిస్టమ్ కింద, SBI కార్డ్ ఇండియా అంతటా ఎయిర్‌పోర్ట్ లాంజ్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ అందిస్తుంది. లాంజెస్‌ని సెట్ A, సెట్ Bగా విభజించింది. కస్టమర్ వద్ద ఉన్న SBI క్రెడిట్ కార్డ్ రకాన్ని బట్టి యాక్సెస్ ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లాంజ్ ప్రయాణికులకు చాలా అవసరం. లాంగ్ వెయిట్స్, ఫ్లైట్ డిలే సమయంలో కంఫర్ట్ అందిస్తుంది. బేసిక్ అమెనిటీస్ అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు లాంజ్ POS మెషీన్‌లో తమ కార్డును వ్యాలిడేట్ చేయడం ద్వారా లాంజ్ యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ కూడా సవరించిన ప్రోగ్రామ్ కింద కొనసాగుతుంది. అప్‌డేటెడ్ లాంజ్ యాక్సెస్ రూల్స్ యాన్యువల్ ఫీజులు రూ.1,499, రూ.2,999 ఉన్న కార్డులకు అప్లై అవుతాయి. ఇక్కడ లాంజ్ యాక్సెస్‌ను SBI నెట్‌వర్క్ పార్ట్‌నర్స్ నిర్వహిస్తారు.
HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ రూల్స్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో కూడా మార్పులు చేసింది. 2026 జనవరి 10 నుంచి రూల్స్ అప్లై అవుతున్నాయి. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌కు అర్హత సాధించడానికి అవసరమైన స్పెండ్ రిక్వైర్‌మెంట్‌ని బ్యాంక్ రెట్టింపు చేసింది. ప్రోగ్రామ్‌లో భాగంగా, బ్యాంక్ వోచర్ బేస్డ్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది. డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం లాంజ్ ఎంట్రీని సులభతరం చేయడానికి, ప్రాసెస్ ఆర్గనైజ్డ్‌గా ఉంచడానికి ఈ కొత్త సిస్టమ్ రూపొందించింది.
కార్డ్ యూజర్స్ ఏం చేయాలి?
ఈ మార్పులు అమల్లోకి రావడంతో, SBI కార్డ్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ కస్టమర్లు అప్‌డేట్ అయిన రూల్స్, ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. రివార్డ్ స్ట్రక్చర్స్, ఫీజులు రివ్యూ చేయాలి. ట్రావెల్ చేసే ముందు కొత్త లాంజ్ యాక్సెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. అన్నీ ముందే తెలసుకోవడం వల్ల లాస్ట్ మినిట్ ఇష్యూస్ ఉండవు. అన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

































