అమెరికాలో మంచు తుఫాన్‌ బీభత్సం.. 25 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో భారీ మంచు తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భీకర మంచు తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.


ఈ తుపాను కారణంగా ఇప్పటివరకు సుమారు 25 మంది మరణించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

న్యూయార్క్ సిటీలో అత్యధికంగా ఎనిమిది మంది ఈ ప్రకృతి వైపరీత్యానికి బలైనట్లు సమాచారం. సోమవారం మసాచుసెట్స్, ఒహియోలో మంచు తొలగించే వాహనాల కింద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అర్కాన్సాస్ నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు దాదాపు 2,100 కిలోమీటర్ల మేర ఒక అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.

ఈ తుపాను కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా మిసిసిపి, టేనస్సీ రాష్ట్రాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పరిస్థితి దారుణంగా మారింది. 1994 తర్వాత మిసిసిపిలో సంభవించిన అత్యంత భయంకరమైన ఐస్ తుపాను ఇదేనని యూఎస్ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఈ భీకర తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ‍కలిగింది. ఆదివారం ఒక్కరోజే అమెరికాలో దాదాపు 45% విమానాలు రద్దయ్యాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఇన్ని విమానాలు రద్దు కావడం ఇదే మొదటిసారి. సోమవారం కూడా దాదాపు 8,000 విమానాలు రద్దు అయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.