నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్(NCESS) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th ప్లస్ ఐటీఐ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ జూనియర్ టెక్నీషియన్ (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి రెగ్యులర్ పోస్టుకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి ప్లస్ ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేయాలి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు అప్లై చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 10.02.2026 సాయంత్రం 5 గంటలకు వరకు ఉంది. http//www.ncess.gov.in మాత్రమే అప్లై చేయాలి.
3 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు రూ.రూ.18,000 నుంచి 56,900 మధ్య ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం తేదీ 23 జనవరి 2026 కాగా చివరి తేదీ 10 ఫిబ్రవరి 2026గా నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజు లేదు.
ముఖ్యమైన విషయాలు
- ఈ పోస్టులు భారత ప్రభుత్వంలో ఒకే హోదాలో ఉన్న ఉద్యోగులకు వర్తించే విధంగా భత్యాలు, ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
- అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. వీటిని తుది ఫలితం ప్రకటించే వరకు యాక్టివ్‌గా ఉంచాలి. ఈ ప్రకటనకు సంబంధించిన కమ్యూనికేషన్ అంతా అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న ఇమెయిల్ – ఐడీ/ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు.
- ఎస్సీలకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వికలాంగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, మాజీ సైనికులు, కశ్మీరీ వలసదారులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులు ప్రస్తుత యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)తో తమ దరఖాస్తులను అప్లోడ్ చేయాలి. రాత పరీక్ష సమయంలో అసలు NOCని సమర్పించాలి. సమర్పించకపోతే ఫలితం నిలిపివేస్తారు.
- అర్హతకు సంబంధించిన అన్ని విషయాలలో NCESS నిర్ణయం దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణ అంతిమంగా ఉంటుంది. ఈ విషయంలో ఏ వ్యక్తి నుండి కూడా ఎలాంటి విచారణ లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు స్వీకరించరు.
- రాత పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల పేర్లు NCESS వెబ్సైట్లో (http//www.ncess.gov.in) తెలియజేస్తారు. ఈ మేరకు అభ్యర్థి అందించిన ఇ-మెయిల్ ఐడి ద్వారా సమాచారం వస్తుంది.
- ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో, వెలుపల ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
- అభ్యర్థులు అవసరమైనప్పుడు తమ దరఖాస్తులలో అందించిన వివరాలకు సంబంధించిన రుజువులను అసలు పత్రాలలో సమర్పించవలసి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
- దరఖాస్తులు ఆన్లైన్లో (http//www.ncess.gov.in) మాత్రమే స్వీకరిస్తారు.
- దరఖాస్తుదారు ఆన్లైన్ దరఖాస్తును పూరించి ఫోటోగ్రాఫ్, సంతకం, సంబంధిత మార్క్ షీట్లు (అన్ని సెమిస్టర్లకు), విద్యా/వృత్తిపరమైన అర్హతల కోసం ప్రొవిజనల్/డిప్లొమా సర్టిఫికేట్, పుట్టిన తేదీకి సంబంధించిన రుజువు, అనుభవ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ అభ్యర్థులు) మొదలైన వాటి స్కాన్ చేసిన చిత్రాలను అప్లోడ్ చేయాలి.
- సర్టిఫికేట్లు, సంతకం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసిన కాపీలు లేకుండా సమర్పించిన దరఖాస్తులు స్క్రీనింగ్ ప్రక్రియలోనే తిరస్కరిస్తారు.
- ఫోటోగ్రాఫ్, సంతకం .jpg ఫార్మాట్లో ఉండాలి. ఫైల్ పరిమాణం 100 కేబీ కంటే తక్కువగా ఉండాలి. అన్ని సర్టిఫికేట్లు పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ప్రతి ఫైల్ 300 కేబీ కంటే తక్కువగా ఉండాలి.
- అభ్యర్థులు రాత పరీక్ష సమయంలో అసలు సర్టిఫికేట్లను సమర్పించాలి. అసలు సర్టిఫికేట్లను సమర్పించకపోయినా లేదా ఆన్లైన్లో సమర్పించిన వివరాలకు భిన్నంగా ఉన్నా అభ్యర్థిని రాత పరీక్షకు హాజరుకాకుండా అనర్హుడిగా ప్రకటిస్తారు.
- ప్రస్తుతం ఏదైనా ఇతర సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు తమ ప్రస్తుత ఉద్యోగానికి సంబంధించిన రుజువును సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే vacancies.ncess@gmail.comకు ఇమెయిల్ చేయండి.

































