అగ్నిగుండంలా ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రతలు రికార్డ్‌ స్థాయిలో నమోదవుతున్నాయి. వడగాలుల ధాటికి ఆగ్నేయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీ సెల్సియస్‌ స్థాయికి పెరిగిపోయాయి.


ఎంతటి చలినైనా తట్టుకునే ఆస్ట్రేలియన్లను ఇంతటి భరించలేని వేడిమి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. విక్టోరియా రాష్ట్రంలోని హోప్‌టౌన్, వాల్ప్‌అప్‌లోని గ్రామీణ పట్టణాల్లో ఉష్ణోగ్రతలు 48.9 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకున్నాయి.

ఇవి బుధవారానికి మరింత పెరిగి 50 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకునే అవకాశముందనే భయాందోళనలు నెలకొన్నాయి. 2009 ఏడాదిలోనూ ఇలాగే వడగాలుల ధాటికి 173 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నమోదైన వడగాలుల కారణంగా ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, కానీ సమీప అడవులు దహనమ య్యే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. విక్టోరియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లోనూ వేడిమి అత్యధికమైంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.