జియోహాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్, షోస్ ఇవే.. లిస్టులో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ

మీరు మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకుంటున్నారా? అయితే జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాప్ 10 కంటెంట్ జాబితా ఇక్కడ ఉంది. ఐఎండీబీ రేటింగ్ ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో రియాలిటీ షోల నుంచి పాత క్లాసిక్ సినిమాల వరకు అన్నీ ఉన్నాయి.

వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెతుకుతున్నారా? అయితే జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌, షోస్ వివరాలు, వాటి రేటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిలో లేటెస్ట్ గా వచ్చిన కంటెంట్ తోపాటు పాతవి కూడా ఉండటం విశేషం. మరి అవేంటో చూడండి.


లాఫర్ చెఫ్స్ (Laughter Chefs)

ఈ జాబితాలో మొదటి స్థానంలో కలర్స్ ఛానెల్ రియాలిటీ షో ‘లాఫర్ చెఫ్స్’ ఉంది. ఇటీవల సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ ప్రసారమైంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 8.5 ఉంది.

స్ప్లిట్స్‌విల్లా సీజన్ 16 (Splitsvilla Season 16)

రెండో స్థానంలో డేటింగ్ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా ఉంది. ఈసారి కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. దీనికి ఐఎండీబీ రేటింగ్ 3.8 మాత్రమే.

గుస్తాఖ్ ఇష్క్ (Gustakh Ishq)

జాబితాలో మూడో స్థానంలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ నటించిన రొమాంటిక్ మూవీ ‘గుస్తాఖ్ ఇష్క్’ నిలిచింది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 8గా ఉంది.

స్పేస్ జెన్: చంద్రయాన్ (Space Gen: Chandrayaan)

నకుల్ మెహతా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఈ స్పేస్ జెన్: చంద్రయాన్. ఇస్రో చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరిగే ఈ సిరీస్ నాలుగో స్థానంలో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 5గా ఉంది.

ఏ నైట్ ఆఫ్ ది సెవెన్త్ కింగ్‌డమ్ (A Knight of the Seven Kingdom)

ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌కు ప్రీక్వెల్ కావడం విశేషం. హెచ్‌బీఓ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఐదో స్థానంలో ఉంది. దీని ఐఎండీబీ రేటింగ్ 6.8.

బోర్డర్ (Border)

1997లో వచ్చి భారీ విజయం సాధించిన వార్ డ్రామా ‘బోర్డర్’ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం దీని సీక్వెల్ (బోర్డర్ 2) బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీ ఐఎండీబీ రేటింగ్ 8.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones)

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇది. మొత్తం 8 సీజన్లు ఉన్న ఈ సిరీస్ ఏడో స్థానంలో నిలిచింది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 9.2గా ఉండటం విశేషం.

లెవన్ (Eleven)

నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘లెవన్’ ఎనిమిదో స్థానంలో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 7.4గా ఉంది.

ది ట్రైన్ ఆఫ్ డెత్ (The Train of Death)

హారర్ మూవీ అయిన ‘ది ట్రైన్ ఆఫ్ డెత్’ తొమ్మిదో స్థానంలో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ కేవలం 4.7.

బిగ్ బాస్ (Bigg Boss)

ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఈ జాబితాలో పదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మధ్యే హిందీ 19వ సీజన్ పూర్తయిన విషయం తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.