తలైవా రజనీకాంత్ బయోపిక్ కన్ఫర్మ్ – వరల్డ్ వైడ్ సెన్సేషన్.

 కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఉండే క్రేజ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు.

ఆయన వాకింగ్ స్టైల్, డ్యాన్స్కే కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. బస్ కండక్టర్ స్థాయి నుంచి స్టార్గా ఎదిగిన ఆయన ప్రయాణం ఇండస్ట్రీలో ఎందరికో స్ఫూర్తి. ఆయన బయోపిక్ సిల్వర్ స్క్రీన్పై రానుందంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై ఆయన కుమార్తె ఐశ్వర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


ఫ్యాన్స్కు గుడ్ న్యూస్

రజనీ కాంత్ బయోపిక్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి ఆటో బయోగ్రఫీ వర్క్ ఇప్పటికే ప్రారంభం అయినట్లు తెలిపారు. ఇది రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్గా ఓ సెన్సేషన్ అవుతుందని అన్నారు. దీంతో అభిమానుల్లో ఓ కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే, ఈ బయోపిక్లో ఎవరెవరు నటిస్తున్నారు? ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇండస్ట్రీలో AI వినియోగంపై…

ఇండస్ట్రీలో AI వినియోగం మంచిదే అయినా అది ఎప్పటికైనా కృత్రిమమే అనేది గుర్తించుకోవాలన్నారు ఐశ్వర్య. అధునాతన టెక్నాలజీ సాయంతో ‘కోచ్చాడయాన్ (2014)’ వంటి విజువల్ వండర్ తెరకెక్కించగలిగామని చెప్పారు. వీలైతే భవిష్యత్తులో అలాంటి మూవీస్ తీయడం తనకు ఇష్టమని అన్నారు. ‘3’, ‘లాల్ సలామ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఐశ్వర్య… ‘విత్ లవ్’ అనే మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

ఈ మూవీలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా నటించగా… మదన్ దర్శకత్వం వహించారు. ‘ఛాంపియన్’ ఫేం అనస్వర రాజన్ హీరోయిన్గా నటించారు. ఫిబ్రవరి 6న సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. అటు, రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’తో బిజీగా ఉండగా జూన్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.