నగరాల్లో ప్రయాణించే వారి కోసం నిస్సాన్ కొత్త కారును విడుదల చేసింది.

నగరాల్లో ఉండే వారు ట్రాఫిక్ నుంచి తప్పించుకొని సులభంగా వెళ్లేందుకు తమకు అనుగుణంగా ఉండే కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటారు.


అయితే SUV కార్లు దూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. కానీ సిటీలో వెళ్లడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ ఇబ్బందిని తొలగించడానికి Nissan కంపెనీకి చెందిన ఓ కారు అద్భుతమైన డిజైన్తో మార్కెట్లోకి వచ్చింది. ఇది లాంగ్ జర్నీతో పాటు సిటీలో మూల మూలన ఈజీగా వెళ్లేందుకు అనుగుణంగా డిజైన్ చేయడంతో పాటు కావలసిన ఫీచర్లను అమర్చారు. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా రాబోతున్న ఈ కారు గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

Nissan కంపెనీకి చెందిన రాబోతున్న కొత్త కారు Gravite 2026. ఈ కారు ఎక్కువగా సిటీలో ఉండే వారికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వెహికల్ డిజైన్ విషయానికి వస్తే ఫ్రంటు లో LED హెడ్ లాంప్స్ ప్రీమియం లుక్ ను అందిస్తుంది. దీనికి సెట్ చేసిన క్లాడెడ్ వీల్ ఆర్చ్, రూఫ్ రెయిల్ కారుకు అందాన్ని తీసుకు వస్తున్నాయి. అలాగే బోల్డు లుక్ లో కనిపించే ఈ కారు 16 అంగుళాల అల్లరి వీల్స్ ను కలిగి ఉన్నాయి. రూఫ్ మౌంటెడ్ soailer, చంకీ రియర్ sqid ప్లేట్ వంటివి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

నిస్సాన్ gravite 2026 కార్ ఇంజన్ ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఇందులో 1.2 లీటర్ అస్పిరేటెడ్ నాచురల్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది 71 బిహెచ్పి పవర్ తో 96 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్లో లీటర్ ఇంధనానికి 14 నుంచి 17 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 40 లీటర్ల ట్యాంకు ఉండే ఈ కారు ఒక్కసారి ఫుల్ ఫీల్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

నిస్సాన్ కొత్త కారు ఇన్నర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్లెస్ చార్జింగ్ స్క్రీన్, ఏసీ వేరియంట్, యూఎస్బీ పోర్టు, సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ వంటివి ఉన్నాయి. అలాగే లెగ్ రూమ్ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే సేఫ్టీ కోసం 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబిడితో ABS టెక్నాలజీ రక్షణ ఇస్తుంది. డిస్క్ బ్రేక్, ఆటో డోర్ లాక్ వంటివి సపోర్ట్ ఉండనున్నాయి.

ఈ కారుకు ఉండే దేనికైనా స్టీరింగ్ వేగంగా కదిలేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సస్పెన్షన్ ఎటువంటి రోడ్లపై నైనా సులభంగా వెళ్లేలా సపోర్టు ఇస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు చిన్న రోడ్లపై కూడా వెళ్లేందుకు అనుగుణంగా స్టీరింగ్ డ్రైవర్లకు అద్భుతమైన అనుభూతి అందిస్తుంది. వీటితోపాటు ఈ కారులో sunroof, జేబీఎల్ ఆడియో, ఫాగ్ ల్యాంప్ వంటివి ఇందులో ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.