మీరు ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెడితే, ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు.

సంపాదించిన మొత్తంలో కొంత సేవ్ చేస్తే ఆ డబ్బు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. పొదుపు చేసిన సొమ్ము కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ పోస్టాఫీస్ పథకాలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి.

రిస్క్ లేకపోవడం, గ్యారంటీ రిటర్స్న్, మంచి వడ్డీ రేట్ రావడంతో ఈ పథకాలకు ఆదరణ పెరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా పోస్టాఫీసు వివిధ రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఇప్పటికీ పోస్టాఫీసు పథకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ పథకంలో ఒకేసారి పెట్టుబడితే.. స్థిర వడ్డీ డబ్బు ప్రతి నెలా మీ ఖాతాలో జమ అవుతుంది. అదే పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం.


పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. మీరు కనీసం రూ.1,000 తో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. MIS పథకం కింద, మీరు ఒకే ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయవచ్చు. ఈ పథకం కింద గరిష్టంగా ముగ్గురు వ్యక్తులను ఉమ్మడి ఖాతాలో చేర్చవచ్చు. పోస్ట్ ఆఫీస్ MIS పథకం కింద నెలవారీ వడ్డీ చెల్లిస్తారు. ఈ వడ్డీ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వరకు మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత, మీ పెట్టుబడి నిధులన్నీ మీ ఖాతాకు బదిలీ అవుతాయి. పోస్ట్ ఆఫీస్‌లో ఈ ఖాతాను తెరవడానికి, మీకు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉండాలి. మీకు పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ ఖాతా లేకపోతే, మీరు ముందుగా ఒక ఖాతాను తెరవాలి. వడ్డీ చెల్లింపులు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే బదిలీ చేయబడతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.