రెడ్‌మి సంస్థ గత నెలలో భారత్ మార్కెట్ లో ( Redmi India ) రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.12 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది.
బడ్జెట్ రేంజ్ లో అందుబాటులోకి వచ్చినా భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 6000mAh బ్యాటరీ, ఏకంగా 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తుంది. రూ.12 వేల ధరలో లేటెస్ట్ ఫోన్ల కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్ ఓ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల వివరాలు.
ధర వివరాలు :
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 15c 5G Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. ప్రస్తుతం షియోమీ ఇండియా ఇ-స్టోర్, అమెజాన్ లో ( Amazon ) అందుబాటులో ఉంది.
6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే :
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 810 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం డస్క్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్ లైట్ బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతోంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP AI కెమెరా, మరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్, USB- C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. ఈ ఫోన్ సెక్యురిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. రూ.12 వేల ధరలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ల కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.


































