APSRTC లో ఉద్యోగాల జాతర..! ఎన్ని వేలంటే..? వారికి జీతాల పెంపు

పీలో ప్రజా రవాణాసంస్ధ (APSRTC)లో చాలా కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. ప్రజా రవాణాశాఖలో విలీనం తర్వాత తొలిసారి భారీ ఎత్తున ఖాళీల్ని భర్తీ చేసేందుకు సంస్థ సిద్దమవుతోంది.


ఇందుకోసం ఆర్టీసీ పాలక మండలి ఓ తీర్మానం కూడా చేసి ప్రభుత్వానికి పంపింది. దీనికి ప్రభుత్వ అనుమతి లభించగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి జీతాలు కూడా పెరకబోతున్నాయి.

ఉచిత బస్సు పథకం అమలు కారణంగా ఆర్టీసీపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆర్టీసీ పాలకమండలి వీటిపై చర్చించింది. అనంతరం మొత్తం 7673 ఉద్యోగాల్ని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 3673 మంది డ్రైవర్లే ఉన్నారు. అలాగే 1813మంది కండక్టర్లు, ఇంకా మెకానిక్ లు, శ్రామిక్ లు, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ మేరకు ఆయా ఉద్యోగాల భర్తీ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ పాలక మండలి ప్రభుత్వానికి విజ్ఞాపన పంపింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. త్వరలోనే ఆర్టీసీకి ఉద్యోగాల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు కూడా జీతాలు పెంచబోతున్నారు. ఆన్ కాల్ డ్రైవర్లకు రోజు వారీ వేతనం 800 నుంచి 1000కి పెంచబోతున్నారు. అలాగే డబుల్ డ్యూటీ కండక్టర్లకు 900కు పెంచుతున్నారు. దీంతో వారిలో అసంతృప్తి కూడా తీర్చబోతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.