టీటీడీ మరో అరుదైన అవకాశం కల్పించింది. ప్రస్తుతం వేసవి సెలవుల్లోనూ తిరుమల లో రద్దీ సాధారణంగా ఉంది. రద్దీ కారణంగా జూలై 15 వరకు నిలుపుదల చేసిన వీఐపీ సిఫారసు లేఖలను ..
ఇప్పుడు రద్దీ తగ్గటంతో తిరిగి పునరుద్దరించారు. నేటి నుంచి సిఫారసు లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. రేపు (శుక్రవారం) నుంచి బ్రేక్ దర్శనాలు కేటాయించనున్నారు. కాగా, ఇదే సమయంలో టీటీడీ యువత కోసం మరో నిర్ణయం అమలు చేస్తోంది. టీటీడీ నిర్దేశించిన విధంగా చేస్తే.. కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నారు.
లేఖల పునరుద్దరణ
తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. ఫలితంగా జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సిఫారసు లేఖలను నిలుపుదల చేసింది. ప్రోటోకాల్ పరిధి లో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించింది. అయితే, టీటీడీ అంచనా వేసిన విధంగా వేసవి రద్దీ ఈ సారి కనిపించటం లేదు. దీంతో.. తాత్కాలికంగా తిరిగి సిఫారసు లేఖలను పునరుద్దరిస్తూ టీటీడీ నిర్ణయించింది. నేటి నుంచి తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తున్నారు. రేపటి నుంచి అవ కాశం మేర బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. ఇది తాత్కాలిక నిర్ణయంగా పేర్కొంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది.
రామకోటి రాసిన భక్తులకు
రామకోటి తరహాలో గోవింద కోటిని ఎవరైతే రాస్తారో వారికి, వారి కుటుంబసభ్యులకు వీఐపీ దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితమే ప్రవేశపెట్టినా, ఇప్పటివరకూ పెద్దగా ప్రచారంలో లేదు. 25 ఏళ్లు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఈ గోవింద కోటి రాసేందుకు అర్హులు. వారు 10,01,115 సార్లు గోవింద కోటి రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులందరికీ వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఈ పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ దొరకవు. కేవలం టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్లోనే గోవింద కోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకం ఒక్కోటి 200 పేజీలు ఉంటాయి. ఇందులో 39,600 నామాలు రాసుకోవచ్చు.
కుటుంబం మొత్తానికి బ్రేక్































