కొన్నిసార్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఫోన్ ధ్యాసలో పడి కొందరు, ఇంటి పనుల హడావుడిలో పడి ఇంకొందరు పిల్లలను గాలికొదిలేస్తుంటారు.
ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ చివరకు ఏవేవో వస్తువులను మింగడం, ట్యాంకుల్లో పడిపోవడం వంటి షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఓ పిల్లాడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి తోటి పిల్లలతో ఆడుకుంటుంటాడు. ఈ క్రమంలో చివరకు అక్కడే ఉన్న ఓ లిఫ్ట్‌లోకి వెళ్లాడు. లోపలికి వెళ్లగానే (child stuck in elevator) లిఫ్ట్ డోర్స్ మూసుకుపోతాయి. తర్వాత ఆ పిల్లాడు లోపల ఉన్న ఫ్లోర్ నంబర్లను నొక్కేస్తాడు.
దీంతో లిఫ్ట్ నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లిపోతుంది. అయితే అప్పటిదాకా సంతోషంగా ఉన్న పిల్లాడు.. ఆ తర్వాత ఒక్కసారిగా గుక్క పట్టి ఏడుస్తాడు. ఈలోగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్లీ పై అంతస్తులోకి వచ్చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది.