ఇండియన్ మార్కెట్ లోకి రకరకాల ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మోటోరోలా ( Motorola) కంపెనీకి మంచి డిమాండ్ ఉంటుంది. బడ్జెట్ లో ఫోన్లు లాంఛ్ చేస్తూ, సామాన్యులను కూడా ఆకట్టుకుంటోంది మోటోరోలా.
అయితే, ఈ తరుణంలోనే, Motorola నుంచి మరో సరికొత్త ఫోన్ వచ్చింది. మోటరోలా సిగ్నేచర్ ( Motorola Signature) పేరుతో లాస్ వెగాస్ లో జరుగుతున్న సెస్ 2026 ( CES2026 ) వేదికగా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇండియాలో ఈ మొబైల్ ను అతి త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2026 త్రైమాసికంలో ఈ మోటరోలా సిగ్నేచర్ మొబైల్ ను లాంచ్ చేయబోతున్నారట.
Motorola Signature ఫీచర్స్ ఇవే
కొత్తగా లాంఛ్ అయిన మోటరోలా సిగ్నేచర్ ( Motorola Signature) ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.8 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్, 50MP (OIS) + 50MP Periscope (OIS) + 50MP (UW) కెమెరా అందిస్తోంది కంపెనీ. సెల్ఫీల కోసం 50MP కెమెరా అందిస్తున్నారు. 5200mAh బ్యాటరీ కూడా రానుంది. 90W వైర్డ్, 50W వైర్ లెస్ ఛార్జర్ ఈ ఫోన్ కు సపోర్ట్ చేయన్నాయి. Android 16 వెర్షన్ ఆధారంగా ఈ ఫోన్ పని చేయనుంది. 6.99mm మందం ఉండనుంది. 12GB + 512GB వేరియంట్ ఫోన్ ధర రూ. 1,09,182 గా ఫిక్స్ చేశారు. అయితే, ఇండియాలో దీని ధర మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.


































