ఐఫోన్ ప్రేమికులకు పండగే.. సెప్టెంబర్ 9న కొత్త ఫోన్ల విడుదల

www.mannamweb.com


ఆపిల్ కంపెనీ విడుదల చేసే ఐఫోన్లకు వినియోగదారుల నుంచి ఎంతో డిమాండ్ ఉంటుంది. ఆ కంపెనీ విడుదల చేసే లేటెస్ట్ మోడల్ ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎప్పటికైనా ఐఫోన్ కొనుగోలు చేసి, వినియోగించాలని చాలామందికి కోరిక కూడా ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ల ధర కొంచె ఎక్కువై అయినప్పటికి స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలలో మిగిలిన వాటికన్నా చాలా మెరుగ్గా ఉంటాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ ఫీచర్లతో ఆపిల్ కంపెనీ తన ఐఫోన్లను అప్డేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న జరిగే “ఇట్స్ గ్లోటైమ్” ఈవెంట్ లో ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండు మోడళ్లు దానికి ముందు వచ్చిన వాటి మాదిరిగా ఉంటాయి. డిస్ ప్లే 6.1, మరియు 6.7 అంగుళాలు ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో సిరీస్ కు యాక్షన్ బటన్ ఉండేది. కానీ ఐఫోన్ 16 మోడళ్లలో మ్యూట్ స్విచ్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఫ్లాష్‌లైట్‌, కెమెరా తదితర వాటిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగపడనుంది.
ప్రామాణిక ఐఫోన్ 16 మోడళ్లలో వెర్టికల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది ఆపిల్ కి చెందిన విజన్ ప్రో హెడ్ సెట్ కోసం స్పేషియల్ వీడియో రికార్డింగ్ ను సమర్థంగా నిర్వహిస్తుంది. నెక్ట్ జనరేషన్ కు చెందిన ఏ18 చిప్ ను ఐఫోన్ 16 మోడళ్ల లో వాడనున్నారు. అలాగే ర్యామ్‌ ను 6 జీబీ నుంచి 8 జీబీ వరకూ విస్తరించనున్నారు. ప్రో మోడళ్లు వైఫై 7ని పొందగలిగినప్పటికీ, ప్రామాణిక ఐఫోన్ 16 వేరియంట్లు వైఫై 6ఈకి అప్‌గ్రేడ్ అవుతాయని భావిస్తున్నారు.
ప్రో మోడళ్లలో డిస్ ప్లే పెరగడం ప్రముఖ మార్పుగా చెప్పవచ్చు. ఐఫోన్ 16 ప్రో డిస్ ప్లే 6.1 నుంచి 6.3 అంగుళాలకు, ప్రో మాక్స్ 6.7 నుంచి 6.9 వరకూ పెరుగుతుంది. యాక్షన్ బటన్‌తో పాటు కొత్తగా క్యాప్చర్ బటన్ కూడా ఉండవచ్చు. వీటిలో మెరుగైన ఏ18 చిప్ ఏర్పాటు చేశారు. అలాగే ఏఐ ఫీచర్లకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఐఫోన్ 16 ప్రో మోడళ్లు కొత్త థర్మల్ డిజైన్‌తో ఆకట్టుకుంటాయి.
48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కారణంగా ఫొటోలను చాాాలా స్పష్టంగా తీసుకోవచ్చు. కాంతి తక్కువగా ఉన్నప్పటికీ కెమెరా పనితనం మెరుగ్గా ఉంటుంది. వీటితో పాటు 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెట్రాప్రిసమ్ లెన్స్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వైఫై 7 టెక్నాలజీ ఈ ఫోన్లలో ఉంటుందని భావిస్తున్నారు.
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో క్వాల్కమ్ కు చెందిన స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 75 మోడెమ్‌ ఉంటాయని అంచనా. దీని ద్వారా మరింత సమర్థవంతంగా 5జీ కనెక్టివిటీ అందుతుంది. వేగంగా చార్జింగ్ చేసుకోవడానికి మద్దతు ఇచ్చే అధిక సామర్థ్యం గల బ్యాటరీలు ఉండే అవకాశం ఉంది.