కాసులు కురిపించే ఫండ్.. రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.10 లక్షలు

మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా రకాల ఫండ్స్ ఉంటాయి. అందులో కొన్ని స్కీమ్స్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి ఇచ్చేలా ఉంటాయి. మరి కొన్ని అధిక రిస్క్‌తో కూడిన స్కీమ్‌ ఉన్నప్పటికీ అవి కూడా హైరిటర్న్స్ ఇస్తుంటాయి..

ఈక్విటీల్లో పెట్టుబడులు అంటేనే రిస్క్‌తో కూడుకున్నది ఉంటుంది. కానీ రిస్క్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ లాభాలు కూడా అదే రీతిలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చు. అయితే సరైన ఫండ్‌ ఎంచుకుని సుదీర్ఘకాలం పాటు ఇన్వె్స్ట్‌ చేసినట్లయితే మంచి రాబడిని కూడబెట్టుకోవచ్చు. బంగారం కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్ పథకాలు ఇటీవల మంచి లాభాలు అందించాయి. అలాంటి ఓ ఈటీఎఫ్ ఫండ్ లో నెలవారీ రూ.10 వేల సిప్ (SIP)లో ఇన్వెస్ట్‌ చేసినట్లయితే సుమారు రూ.10 లక్షల వరకు రాబడిని అందుకోవచ్చు. ఈ పెద్ద మొత్తాన్ని 5 సంవత్సరాల్లోనే అందుకోవచ్చు. మరి  దీనిఈ స్కీమ్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


తమ పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో రిటర్న్స్ ఇచ్చిన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ ( LIC MF Gold ETF). ఈ స్కీమ్ గత ఐదేళ్లలో చూసుకుంటే సిప్‌ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్- SIP) రాబడులు సగటున వార్షికంగా 20.93 శాతంగా ఉన్నాయి. అంటే ఐదు సంవత్సరాలుగా ఇందులో నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.9.93 లక్షలు అవుతుంది. సుమారు రూ.10 లక్షలు.

ఈక్విటీ, బాండ్ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల మధ్య బంగారం స్థిరత్వాన్ని అందిస్తూనే ఉన్నందున పెట్టుబడిదారులు బంగారంపై తిరిగి విశ్వాసం పొందుతున్నారని కూడా ఈ పెరుగుదల చూపిస్తుందని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ రీసెర్చ్ నేహల్ మెష్రామ్ అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.