మనం సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించే ఒక మంచి బిజినెస్‌ ఐడియా

ఉద్యోగం చేసే చాలా మంది ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత మంచి వ్యాపారం ప్రారంభించి సెటిల్‌ అవ్వాలని అనుకుంటారు.


అయితే మనం సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..

మానవ మనుగడ కొనసాగాలంటే ఆహారం, వస్త్రాలు ఎంత ముఖ్యమో వైద్యం కూడా అంతే ముఖ్యం. అందుకే వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారాల్లో ఎప్పుడూ నష్టం అనేది ఉండదని చాలా మంది అంటుంటారు. ఎంత కాంపిటేషన్‌ ఉన్నా వైద్య రంగంలో మంచి లాభాలు ఆర్జించవచ్చు. వైద్య రంగానికి సంబంధించి అందుబాటులో ఉన్న ఇలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్య రంగంలో మందులు, శస్త్రచికిత్సకు అవసరమయ్యే యంత్రాలతో పాటు కచ్చితంగా అవసరపడే మరో వస్తువు కాటన్‌. సర్జికల్‌ కాటన్‌కు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు అవుతున్నాయి. మెడికల్ షాపుల సంఖ్య పెరుగుతోంది. ఇక పెరుగుతోన్న శస్త్రచికిత్సలకు అనుగుణంగా సర్జికల్‌ కాటన్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. మరి ఇలాంటి సర్జికల్ కాటన్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తే ఊహకందని లాభాలను ఆర్జించవచ్చు. ఇంతకీ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చు అవుతుంది.? లాంటి వివరాలు మీకోసం..

సర్జికల్‌ కాటన్‌ తయారీ కోసం ముందుగా హోల్‌సేల్‌లో పెద్ద ఎత్తున పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కాటన్‌ను స్థానికంగా ఉండే కాటన్‌ మిల్స్‌ నుంచి నేరుగా కొనుగోలు చేయొచ్చు. అనంతరం ఈ కాటన్‌ను కొన్ని రకాల రసాయనాలతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా పత్తిని శుభ్రం చేసిన తర్వాత దాంతో సర్జికల్‌ కాటన్‌ తయారు చేస్తారు. ఇందుకోసం కొన్ని మిషిన్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చివరిగా పత్తిని రౌండ్‌ షేప్‌లో ప్యాకింగ్‌ చేస్తారు.

ఎంత పెట్టుబడి.? లాభాలు ఎలా ఉంటాయి.?

సర్జికల్‌ కాటన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటే పెట్టుబడి పెద్ద మొత్తంలో అవసరపడుతుంది. కేవలం యంత్రాలకే రూ. 70 లక్షలు కావాల్సి ఉంటుంది. రా మెటీరియల్స్‌ కోసం కనీసం రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే పెట్టుబడికి తగ్గట్లుగానే ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్జికల్‌ కాటన్‌ను మంచి బ్రాండింగ్‌తో హోల్‌సేల్‌ అమ్మకాలు చేస్తే నెలకు కనీసం రూ. 2 లక్షల ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. ఇప్పటికే ఈ వ్యాపారాన్ని రన్‌ చేస్తున్న వారిని నేరుగా సంప్రదించి బిజినెస్‌ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు.