తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో దేశాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలావరకు అందర్నీ అబ్బురపరిచే విధంగానే ఈ వీడియో లు ఉంటాయి.
అయితే రోజు వైరల్ అయ్యే వీడియోలను చాలామంది ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు కొంతమంది అయితే సోషల్ మీడియాలో వైరల్ వీడియోలను టైప్ చేసి మరి రోజు రోజు వైరల్ అయ్యేవి చూస్తూ ఉంటారు. అయితే ఇటీవల సూర్యుడికి సంబంధించిన ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియోలో ఏకంగా ఏడు సూర్యుడులు ఒకే చోట కనిపించాయి. దీంతో ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఈ దృశ్యాలు ఎక్కడ కనిపించాయో, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చైనా నుంచి వైరల్ అవుతుంది వచ్చిన ఒక వీడియో ఇప్పుడు భారత్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఏకంగా ఏడు సూర్యులు కనిపించిన అద్భుతమైన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. ఈ వీడియోను చైనాకు సంబంధించిన ఓ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియో ‘డైలీ లౌడ్’ అనే X ఖాతా నుంచి వైరల్ అవుతుంది. ఆకాశంలోని సరిగ్గా సరళరేఖ దగ్గర ఏడు సూర్యులు కనిపించాయి. ఇందులో కొన్ని చాలా క్లియర్ గా కనిపిస్తే మరికొన్ని మాత్రం మసకగా కనిపించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్‌గా మారాయి.
అయితే, ఈ వీడియో చైనాలోని చెంగ్డు నగరంలో కనిపించిందని..ఈ దృశ్యాలను హాస్పిటల్లో ఉండే వాంగ్ అనే మహిళ తన స్మార్ట్ ఫోన్‌తో రికార్డ్ చేసింది. అయితే గాజు కిటికీలో నుంచి తీయడం కారణంగా ఇలా ఏడు సూర్యుడులు కనిపించాయని కొంతమంది చెబుతున్నారు. ఇది కాంతి వక్రీభవనానికి కారణమైందని వారు అంటున్నారు. అయితే ఈ వీడియో గతంలో ఎప్పుడో చిత్రీకరించిందని.. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతూ వస్తోందని కొంతమంది చెబుతున్నారు. ఇప్పటికీ ఇలాంటి వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయని వారు చెబుతున్నారు.
ఇక ఈ వీడియో చూసిన మరి కొంతమందైతే వివిధ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ వీడియో అసలైంది.. కాదని AI ద్వారా సృష్టించిందని అంటున్నారు. మరి కొంతమందైతే ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలాంటి మార్పులు వస్తాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమందైతే ఇది పాత వీడియో అయినప్పటికీ ఇప్పుడు వైరల్ అవుతూ వస్తోందని కామెంట్లలో చెబుతున్నారు. ఖగోళంలో కొన్ని మార్పుల కారణంగా సూర్యుడు ఇలా ఒకేసారి వివిధ ఆకారాలతో దర్శనమిస్తాడని కొంతమంది ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
































