యూట్యూబ్(Youtube) ఎప్పటికప్పుడు పలు రకాల మార్పులు, అప్‌డేట్‌లను తీసుకువస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం YouTube AI ఫీచర్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా యూట్యూబ్ మరో కొత్త ప్రకటన చేసింది. దీని ప్రకారం ఇప్పుడు షార్ట్ వీడియో సృష్టికర్తలు గరిష్టంగా 3 నిమిషాల వరకు చిన్న వీడియోలను సృష్టించుకుని అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం 59 సెకన్ల నిడివి గల వీడియోలు మాత్రమే అప్‌లోడ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు క్రియేటర్లు గరిష్టంగా 3 నిమిషాల షార్ట్ ఫీడ్ వీడియోలను ఉపయోగించుకోవచ్చు.