ఒప్పో నుంచి లక్ష రూపాయల ఫోన్‌.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి

www.mannamweb.com


బడ్జెట్‌ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో తాజాగా మార్కెట్లోకి ప్రీమియం బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 8 సిరీస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8 సిరీస్‌ పేరుతో కొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8. ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8 ప్రో పేరుతో ఈ రెండు ఫోన్‌లను లాంచ్‌ చేసింది. డిసెంబర్‌ 3వ తేదీ నుంచి ఈ ఫేన్‌ సేల్‌ ప్రారంభం కానుంది.

ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.95 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ ఇన్ఫినిట్‌ వ్యూ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ డైనమిక్‌ రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లాను అందించారు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌, 512 జీబీ వేరియంట్స్‌తో తీసుకొస్తున్నారు. ఇందులో 80 వాట్స్‌ సూపర్‌ వూక్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5630 ఎమ్‌ఏహెచ్‌ కెసాసిటీ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే.. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 69,999, 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు.

ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 8 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ ఇన్ఫినిట్ వ్యూ డిస్‌ప్లేను అందించారు. 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఐపీ68, ఐపీ69 రేటింగ్‌ను ఇచ్చారు. 80 డిగ్రీల వేడి నీటిలో కూడా డ్యామేజ్ కాదని చెబుతోంది.

కెమెరా విషయానికొస్తే ఫైండ్‌ ఎక్స్‌ 8 ప్రోలో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను, 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 80 వాట్స్‌ సూపర్‌ వూక్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌, 50 వాట్స్‌ ఎయిర్‌వూక్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5910 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే టాప్‌ వేరియంట్‌ రూ. 99,999గా నిర్ణయించారు.