కొబ్బరి నీళ్లలో కంటే కొబ్బరి పువ్వులోనే అధిక పోషకాలుంటాయనీ, దాన్ని తినడం ఆరోగ్యకరమనీ నిపుణులు చెబుతున్నారు.
- కొబ్బరి పువ్వులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు చాలా స్వల్ప పరిమాణంలో ఉంటాయి. కాబట్టి దాన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. శరీరం బరువు పెరగదు. అదనపు కొవ్వులు కరిగి శరీరం సరైన ఆకృతిని సంతరించుకుంటుంది.
- కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు సమృద్దిగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
- కొబ్బరి పువ్వులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా నిర్భయంగా తినవచ్చు. దానిలో ఉండే ఫ్రీ రాడికల్స్ శరీరాన్ని కేన్సర్ కారకాల నుంచి రక్షిస్తాయి. మహిళలకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనాన్ని కల్గిస్తాయి.
- కొబ్బరి పువ్వు తినడం వల్ల చర్మం, శిరోజాలకు కావాల్సినంత తేమ లభిస్తుంది. శిరోజాలు నల్లగా మెరుస్తుంటాయి. మొటిమలు, మచ్చలు, ముడుతలు తొలగిపోయి చర్మం బిగుతుగా, కాంతివంతంగా మారుతుంది.
- దీనిలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్, యాంటీ పెరాసిటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనారోగ్యాన్ని దరిచేర్ఝ నివ్వవు.
































