బుల్లెట్ బైక్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే

అసలే ఎండాకాలం.. ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎండ వేడిమిలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే బైక్ పైగానీ,స్కూటర్ పై గానీ వెళ్ల లేం.


ఇటువంటి పరిస్థితుల్లో మనం కారు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం. తక్కువ ధరల్లో కారు లభిస్తే బాగుండు అనుకుంటాం..అటువంటి వారికి కోసం అత్యంత సరసమైన ధరతో కారు మార్కెట్లో లభిస్తోంది..దీని ధర ఇంచుమించు బుల్లెట్ బండి ధరకు సమానంగా ఉంటుంది. ఇంతకీ ఆ కారు ఏ కంపెనీ, మోడల్ ఏదీ, ధర.. ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..

మారుతి సుజుకీ అత్యంత సరసమైన ధరకు మారుతి ఆల్టో K10 కారును అందిస్తోంది. మారుతి సుజుకీ తక్కువ బడ్జెట్ లో కారు కొనుగోలు చేయాలనుకునే వారికోసం 2023 లో ఈ కొత్త ఆల్టో కె 10 ని విడుదల చేసింది. ఈ కారు బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 4.50 లక్షల వరకు ఉంటుంది. బేస్ మోడల్ తో పాటు కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఫీచర్లను కారు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కస్టమర్ కు మేలు మరో విషయం ఏంటంటే.. EMI కూడా చాలా తక్కువగా ఉంటుంది.

బుల్లెట్ ధరకు సమానం

ఎక్కువ దూరం, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించాలంటే.. ఖరీదైన బైక్ కన్నా చౌకయిన కారు బెటర్.. ఆల్టో కె 10 ఆన రోడ్ ధర దాదాపు రూ. 3.99లక్షలు ఉంటుంది. ఇది టాప్ మోడల్ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ సూపర్ మీటర్ 650 ఆన్ రోడ్ ధర కూడా ఉంది.

మారుతి ఆల్టో కొత్త కారుపై తక్కువ EMI

మారుతి ఆల్టో కె10 బేస్ మోడల్ ను కొనుగోలు చేయడానికి రూ. 1.35 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే చాలాు. 7సంవత్సరాల పాటు 9 శాతం వడ్డీ రేటుతో కేవలం నెలకు 5వేలతో EMI లు చెల్లించొచ్చు.

కొత్త మారుతి సుజుకీ ఆల్టో కె 10 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.వీటిలో Std, LXi, VXi, VXi+ ఉన్నాయి. CNG వెర్షన్ ను VXi మోడల్ తో కొనుగోలు చేయవచ్చు. టాప్ మోడల్ ధర దాదాపు రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.

మైలేజీ సూపర్..

మారుతి ఆల్టో కె 10 1.0 లీటర్ 3 సిలిండర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 66bhp శక్తిని 89 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ యూనిట్ , 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ కారు ఆల్టో 800 కంటే శక్తివంతమైనది. మైలేజీ గురించి చెప్పాలంటే.. ఈ కారు ఒక లీటర్ పెట్రోల్ తో 24 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఒక కిలో CNG తో 33 కిలోమీటర్లు వరకు ప్రయాణించొచ్చు.