టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

 టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ నటుడు సురేష్ కుమార్ ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. మూడు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన సురేష్ కుమార్ కు, మల్టీ నేషనల్ బ్యాంకుల్లో అత్యున్నత పదవులలో పనిచేసిన అనుభవం ఉంది.


అయితే సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన సురేష్ కుమార్, దాదాపు నాలుగు భాషల్లో నటించారు. తెలుగు, తమిళ్, హిందీ, మరాఠి భాషల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు సురేష్ కుమార్. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా మెరిసారు. ఈ సినిమాతో పాటు మహానటి, గోల్కొండ హై స్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల్లో కూడా మెరిశారు. అయితే సురేష్ కుమార్ గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలుపుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.