షారూక్ ఖాన్‌కు అరుదైన గౌరవం. . తొలి భారతీయ నటుడిగా చరిత్రలోకి

www.mannamweb.com


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయనక్కర్లేదు. తన సినిమాలతో బీటౌన్‌ను ఏలుతున్న త్రీఖాన్స్‌లో తొలి స్థానంలో ఉంటాడు. ఇక దక్షిణాది ఇండస్ట్రీలో కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే టాలీవుడ్ మార్కెట్‌పై కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. గతంలో అతడి సినిమాలు డబ్బింగ్ రూపంలోనూ అలరించాయి. ఇటీవల ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. టీవీ నటుడి నుండి కింగ్ ఖాన్ ఎదిగిన అతడు.. అందుకోని అవార్డు లేదు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన పాదాక్రాంతం. గత ఏడాది మూడు సినిమాలతో అలరించగా.. డంకీ మినహా మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీసును షేక్ చేసేసిన సంగతి విదితమే.

ఇదిలా ఉంటే.. షారూక్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన ఎనలేని సేవలను ఫ్రాన్స్ మ్యూజియం గుర్తించి.. గౌరవించనుంది. ఆయన పేరుతో బంగారు నాణేలు ముద్రించి షారూఖ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంది ఫ్రాన్స్‌లోని గ్రేవిన్ మ్యూజియం. ఆయన పేరుతో బంగారు నాణేలను ముద్రించగా.. త్వరలో సత్కరించనుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన ఏకైక (ప్రస్తుతానికి) అండ్ తొలి భారతీయుడిగా కింగ్ ఖాన్ చరిత్ర పుటలకు ఎక్కాడు. ఆగస్టు 10వ తేదీన అవార్డుతో పాటు షారూఖ్ ఖాన్ బంగారు నాణేలను మ్యూజియం విడుదల చేయనుంది. వందకు పైగా సినిమాలు చేయడంతో పాటు నిర్మాతగా కొనసాగుతున్నాడు షారూక్. ఆయనకు మాత్రమే దక్కిన అరుదైన పురస్కారం ఇది.

అలాగే లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ అవార్డుకు కూడా ఎంపికయ్యారు షారూఖ్. కెరీర్ అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించనుంది. ఆగస్టు 7 నుండి 17 వరకు లోకర్నో (స్విట్జర్లాండ్)లో ఈ కార్యక్రమం జరగనుంది. 77వ ఎ డిషన్‌లో భాగంగా ఈ అవార్డును షారూక్ అందుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన హిట్ మూవీల్లో ఒకటైన దేవదాస్ ను అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటుడిగా బాద్ షా నిలిచాడు.ఇదిలా ఉంటే.. డంకీ తర్వాత షారూఖ్ కొత్త సినిమాలేవి ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది కూతురు సుహానా ఖాన్ లేదా కొడుకు ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.