ప్రస్తుతం నడుస్తోంది కృత్రిమ మేధస్సు యుగం. ఇప్పుడు అన్నీ సాధ్యమే. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో మనుషులను మించిపోయేలా రోబోలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కూడా రోబోలు ప్రవేశించాయి, పొలంలో రైతులా పని చేస్తున్న రోబో వీడియో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చైనాకు సంబంధించినదిగా తెలుస్తోంది.
ది ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్ అనే టైటిల్ తో షేర్ చేసిన ఈ వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన వీడియోలో రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో రోబోట్ పొలంలో చకచకా నాట్లు వేస్తుంది. పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేసే ప్రతి పనిని చకచకా చేసేస్తోంది.
@InterestingSTEM అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా పని కల్పించాలి.. వంద మంది చేసే పనిని ఒక్క రోబోతో చేయించడం వలన సమస్య పెరుగుతుందని అని కామెంట్ చేస్తే.. మరికొందరు ఎక్కువ మందితో చేయించాల్సిన పొలం పని ఒక్క రోబో చేయడం వలన వ్యవసాయం చేయడానికి అయ్యే ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. మరికొందరు పొలంలో దుక్కి దున్నడం, వరి నాట్లు వేసే సమయం, కోత సమయం ఒక అద్భుతమైన వీక్షణం. పాటలు పాడుతూ పంట కోసే వంటి అనేక హృదయాన్ని హత్తుకునే ప్రకృతి అందాలు పోయి.. రోబో తో పని చేయించడం వలన మనుషులు కూడా కృతిమంగా మారిపోతారేమో అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.