ఇది కదా బంపర్ ఆఫర్ అంటే.. 51శాతం డిస్కౌంట్.. రూ.15వేలకే సూపర్ ల్యాప్‌టాప్..

కేవలం రూ.15,990కే అదిరిపోయే ల్యాప్‌టాప్ మీ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో 51శాతం డిస్కౌంట్‌తో దొరుకుతున్న ఏసర్ ఆస్పైర్ 3 ల్యాప్‌టాప్‌లో 8GB RAM, వేగవంతమైన SSD స్టోరేజ్, ఏకంగా 8 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉన్నాయి. కేవలం 1 కిలో బరువు ఉండే ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులకు, ఆఫీస్ పనులకు చాలా మంచి ఆప్షన్.

మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్లయితే.. ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మీకు SSD స్టోరేజ్‌తో పాటు ఒకే ఛార్జ్‌పై అద్భుతమైన బ్యాటరీ జీవితాన్ని అందించే ఒక ల్యాప్ టాప్ ఉంది. అదే ఏసర్ ఆస్పైర్ 3. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 51 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత.. ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.15,990కి కొనుగోలు చేయవచ్చు.


ఈ సరసమైన ఏసర్ ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 11.6-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటెల్ సెలెరియన్ N4500 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ అల్ట్రా HD గ్రాఫిక్స్‌ను ఇందులో పొందుపరిచారు. ఈ ల్యాప్‌టాప్ 8GB RAM, 128GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. SSD వలన ల్యాప్‌టాప్ చాలా వేగంగా ఆన్ అవుతుంది, ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌గా విండోస్ 11 హోమ్‌పై పనిచేస్తుంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ల్యాప్‌టాప్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

ఇతర ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే.. ఈ ల్యాప్‌టాప్ HD 720p ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని బరువు కేవలం 1 కిలోగ్రాము మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం ఇందులో అద్భుతమైన స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో మైక్రో SD కార్డ్ రీడర్ స్లాట్ కూడా అందుబాటులో ఉంది.

రూ.20,000 ధర పరిధిలో ఈ ఏసర్ మాత్రమే కాకుండా మరిన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి.

  • లెనోవో క్రోమ్ బుక్ Duet 11M889: రూ.19,990
  • ప్రైమ్‌బుక్ 2 Pro 2025: రూ.18,490
  • ఏసస్ క్రోమ్ బుక్CX15: రూ.19,899

తక్కువ బడ్జెట్‌లో మంచి పర్ఫార్మెన్స్, SSD స్టోరేజ్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఈ మోడల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విద్యార్థులు లేదా సాధారణ పనులు చేసుకునే వారికి ఈ ల్యాప్‌టాప్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.