వయసు పెరిగేకొద్దీ ముఖం మీద కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖం మీద కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ముఖం మీద కొవ్వు కారణంగా డబుల్ చిన్ ..
ముఖ్యంగా ముఖం మీద కొవ్వు కారణంగా డబుల్ చిన్ ఏర్పడుతుంది. ఈ కింది కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ఈ కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.
చాలా మంది ముఖం మీద కొవ్వు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. దీనిని వదిలించుకోవడానికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడిపోతుంటారు. ఇది ముఖం ఆకృతిని కూడా మార్చుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు ముఖాన్ని స్లిమ్ గా చేసుకోవడానికి వీలైనన్ని ఎక్కువ ముఖ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. ముఖంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
ఇలాంటి వారు ముఖంపై ఫ్యాట్ తగ్గించుకోవడానికి దవడను ముందుకు తోసి 2 సెకన్ల పాటు అలాగే పట్టుకోవాలి. ఇలా రోజుకు 10 సార్లు చేయాలి. ఇది ముఖంపై ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని రోజుల్లో కొవ్వు మాయమవుతుంది.
మీకు వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే చూయింగ్ గమ్ ద్వారా కూడా ముఖాన్ని స్లిమ్‌గా మార్చుకోవచ్చు. చూయింగ్ గమ్ ముఖంపై కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
































