మీ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో పీవీసీ కార్డును ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు స్పీడ్ పోస్ట్ ఖర్చుతో సహా రూ.50 మాత్రమే చెల్లించాలి. యూఐడీఏఐ ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) కార్డును జారీ చేస్తోంది.
ముందుగా మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత ‘మై ఆధార్ సెక్షన్’లో ‘ఆర్డర్ ఆధార్ పివిసి కార్డ్’పై క్లిక్ చేయండి.
మీరు ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేసిన వెంటనే, మీరు 12 అంకెల ఆధార్ నంబర్, వర్చువల్ ఐడీ లేదా ఈఐడీని పూరించాలి. ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను పూరించి, దీని తర్వాత కింద ఉన్న ‘సెండ్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి చివరగా పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు రూ.50 చెల్లించాలి
పేమెంట్ పూర్తయ్యాక మీకు ఆర్డర్ నెంబర్ మెసేజ్ వస్తుంది. అంతే పది నుంచి పదిహేను రోజుల్లో మీ ఆధార్ అడ్రస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది.